ఒక్క రాంగ్ స్టెప్ తో కెరీర్ సర్వనాశనం చేసుకున్న స్టార్ హీరోయిన్లు వీళ్ళే.. మహా ముదుర్లే రా బాబు..!!

సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్ డమ్ సంపాదించుకోవడం ఎంత కష్టమో.. ఆ స్థానం నిలబెట్టుకోవడం కూడా అంతే కష్టం. ఒకసారి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న నటులు రాంగ్ డెసిషన్ తో సడన్ గా డౌన్ అయి కెరీర్ నాశనం చేసుకున్నారు. అలా తమ కెరియర్ లో ద బిగ్గెస్ట్ రాంగ్ స్టెప్ తీసుకొని ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న స్టార్ హీరోయిన్స్ ఎవరో? ఒకసారి చూద్దాం..!

సాయి పల్లవి :
టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సాయి పల్లవి.. లేడీ పవర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది. సినిమా అవకాశాలు వచ్చిన హీరోలకు కండిషన్లు పెట్టడం, మరి కొంతమంది హీరోలతో నటించినని చెప్పేయడంతో డైరెక్టర్లు కూడా సాయి పల్లవిని సినిమాల్లో తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. దీంతో మంచి క్రేజ్‌ ఉన్నా సాయి పల్లవికి అవకాశాలు తగ్గిపోయాయి. ప్రస్తుతం శివ కార్తికేయ సినిమాలో మాత్రమే నటిస్తుంది.

రాశి ఖన్నా :
ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాశి ఖన్నా కథతో సంబంధం లేకుండా వచ్చిన అవకాశాలు వచ్చినట్లు సినిమాల్లో నటిస్తూ తన క్రేజ్‌ను పోగొట్టుకుంది. దీంతో అవ‌కాశ‌లు రావ‌డం లేదు. స్టార్ స్టేటస్ పోగొట్టుకున్న రాశి కన్నా ప్రస్తుతం టాలీవుడ్ కి దూరంగా ఉంటుంది.

పూజా హెగ్డే :
టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన పూజా హెగ్డే టాలీవుడ్ అగ్ర తారల అందరి సరసన నటించిన ఎనో హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. ఇక తాజాగా ఆమె స్టార్ హీరోస్ సరసన నటించిన నాలుగు సినిమాలు వరుస ప్లాపులను అందుకోవడంతో సోషల్ మీడియాతో పాటు.. టాలీవుడ్ లో కూడా పూజ హెగ్డేను ఎవరు పట్టించుకోవడం లేదు. స్టార్ హీరోస్ తో అతిగా ప్రవర్తించడం కూడా ఆమె డౌన్ ఫాల్ కి కారణమని అంటున్నారు నెటిజన్స్.

కృతి శెట్టి :
ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది కృతి శెట్టి. తరువాత ఆమె తీసుకున్న రాంగ్ డెసిషన్ కారణంగా అంతే ఫాస్ట్ గా డౌన్ ఫాల్ అయింది. సినిమా కథలను ఎంచుకునే విషయంలో రాంగ్ స్టెప్ తీసుకున్న కృతిశెట్టి వరుస డిజాస్టర్ లను చవి చూసింది. దీంతో ప్రస్తుతం కృతి శెట్టి చేతిలో ఒకటంటే ఒక్కటే సినిమా ఉంది. అది కూడా ఈ మధ్యనే సైన్ చేసింది.