తొలిప్రేమ, ఖుషి, బద్రి ఇలా చెప్పుకుంటూ పోతే అతన్నీ ప్రతి సినిమా ఒక మ్యూజికల్ హిట్ అనే చెప్పొచ్చు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఇష్టమైన సంగీత వాయిద్యం గిటార్. అతను నటించిన చాలా సినిమాల పోస్టర్లలో గిటార్ స్పష్టంగా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. హీరో గా పవన్ కళ్యాణ్ ని మరో మెట్టు ఎక్కించిన తొలిప్రేమ 1998 నుంచి తాజాగా వచ్చిన బ్రో సినిమా వరకు అతని సినిమాల్లో గిటార్ కనిపిస్తూ ఉంటది.
తొలిప్రేమ (2009), బాలు (2005), కొమరం పులి (2010), తీన్ మార్ (2011), అత్తారింటికి దారేది (2013), కాటమరాయుడు (2017), అజ్ఞాతవాసి (2018), బ్రో (2023) వంటి సినిమాల్లో పవన్ కళ్యాణ్ రకరకాల గిటార్లు వాడాడు, ఇందులో ఎలక్ట్రిక్ గిటార్, అకౌస్టిక్ గిటార్, బాస్ గిటార్ ఇలా అనేక గిటార్లు ఉన్నాయి. పవన్ గిటార్ వాయించడంలో చాలా నైపుణ్యం కలిగి ఉన్నాడు అని కొంతమంది అంటారు.
ఇదిలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ తేజ్ హీరోలుగా నటించిన ‘ బ్రో ‘ ఇండియన్ సినిమా డేటాబేస్ లో 9.0/10 రేటింగ్‌ను అందుకుంది. ఇది ఒరిజినల్ చిత్రం ‘ వినోదయ సీతమ్ ‘ కంటే ఎక్కువ రేటింగ్ ఏ వచ్చింది. బ్రో సినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే మాటలు అందిచాడు
ఈ సినిమాతో తొలిసారి మేనమామ, మేనల్లుడు అయినా పవన్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించారు. వినోదయ సీతం అక్టోబర్ 13 (2021) నా రిలీజ్ అయింది. బ్రో మూవీ జూలై 28న (2023) రిలీజ్ అయింది. కానీ వినోదయ సీతం కంటే బ్రో రేటింగ్ పరంగా టాప్ లో ఉంది. బహుశా పవన్ ఫాలోయింగ్ వల్లే సినిమా ఆడినట్లు తెలుస్తుంది.