అక్కినేని కుటుంబం నుంచి నాగార్జున తర్వాత మూడోతరం హీరోగా టాలీవుడ్ లో అడుగు పెట్టిన నాగచైతన్య తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. అలాంటి నాగచైతన్య మరో స్టార్ హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. పెళ్లి తర్వాత వీరి మధ్య ఎలాంటి అన్యోన్యత ఉందో వీరు నటించిన సినిమాలే చెబుతాయి. అదేవిధంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట అభిమానులకి ఎవరు ఊహించని షాక్ ఇస్తూ విడాకులు తీసుకుని ఎవరి దారి వారు చూసుకుంటూ ఎవరి పనిలో వారు బిజీ అయిపోయారు.
ఈ క్రమంలోనే టైం దొరికినప్పుడల్లా వీరి అభిమానులు ఏదో ఒక విషయాన్ని ఈ ఇద్దరి గురించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు మరోసారి సమంత- నాగచైతన్యల గురించి మరో వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. అదేమిటంటే నాగచైతన్య, సమంతతో ప్రేమలో ఉన్నప్పుడే మరో హీరోయిన్ను కూడా ఎంతో ప్రేమించారట. కానీ సమంత కారణంగానే ఆ హీరోయిన్ కి దూరమయ్యాడట. ఇక ఇప్పుడు అసలు మ్యాటర్‌లోకి వెళితే సమంత- నాగచైతన్య ఇద్దరు ఏం మాయ చేసావే సినిమా చేసే సమయంలో ఇద్దరి ఆలోచనలు అభిప్రాయాలు కలవడంతో ఇద్దరు స్నేహితులగా మారారు.. తర్వాత ఆ స్నేహం కాస్త ఇద్దరి మధ్య ప్రేమగా మారింది.
ఇక ఇదే సమయంలో సినిమా పరిశ్రమలో రూమర్లకి కొదవలేదు అన్నట్లు నాగ చైతన్య ప్రేమమ్ సినిమా చేసే సమయంలో సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ గా మారింది. ఆ వార్త ఏమిటంటే ప్రేమమ్ సినిమాలో నాగచైతన్యతో కలిసి నటించిన శృతిహాసన్‌తో చైతు ప్రేమలో పడ్డారని అంతే కాదు ఆ సినిమా షూటింగ్ తర్వాత ఒక సంవత్సరం పాటు వీరిద్దరూ డేటింగ్ చేశారని, కానీ అదే సమయంలో సమంత, నాగచైతన్య మధ్య అంతకుముందే ప్రేమ ఉందని తెలుసుకుని శృతిహాసన్, నాగచైతన్యకు బ్రేకప్ చెప్పిందనే వార్తలు గట్టిగా వినిపించాయి.
అదేవిధంగా నాగచైతన్యకు సమంతతో ఉన్న తన ప్రేమ కారణంగానే శృతిహాసన్ కి దూరమయ్యాడని, ఒకవేళ సమంతకి దగ్గర కాకుండా ఉంటే కచ్చితంగా శృతిహాసన్‌ను పెళ్లి చేసుకునేవాడని అప్పట్లో ఈ వార్త తెగ వినిపించింది. అయితే ఇప్పుడు తాజాగా నాగచైతన్య దుస్థితిని చూసి కొంతమంది నెటిజెన్లు అప్పుడే సమంతకు దూరమై శృతిహాసన్ ను పెళ్లి చేసుకుంటే చైతన్య హ్యాపీగా ఉండేవాడు కదా అంటూ ఈ వార్తను మరోసారి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.