అప్ప‌టికే పెళ్లైన చ‌లం మాయ‌లో ప‌డిన శార‌ద‌.. శాడిస్ట్‌గా న‌ర‌కం చూపించ‌డంతో విడాకులిచ్చిందా..!

శారద 1970 – 80వ దశంలో ఎంతో మంది హీరోయిన్లు తెలుగు సినిమా రంగాన్ని ఏలారు. వారిలో తనకంటూ ప్రత్యేకమైన సహజనటిగా గొప్ప గుర్తింపు తెచ్చుకున్నారు శారద‌. అందుకే ఆమెకు ఊర్వశి అనే బిరుదు వచ్చింది. ఆ తరంలో ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి నటించిన శారద అంటే ఎన్టీఆర్కు ఎంతో ప్రత్యేకమైన అభిమానం. శారద కెరీర్ ప్రారంభంలోనే ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి బాగా ఆస్తులు కూడా పెట్టుకున్నారు. అయితే ఆమె జీవితంలో చేసిన అతి పెద్ద పొరపాటు ఏంటంటే అప్పటికే పెళ్లయిన చలాన్ని భర్తగా స్వీకరించడం.

శార‌ద‌కు బాగా ఆస్తులు ఉన్నాయి. సినిమా షూటింగులు జరుగుతున్నప్పుడు చ‌లం నాకు ఎన్నో ఆస్తులు ఉన్నాయి.. నాకంటూ ఎవరూ లేరు నాకు జీవితంలో ఎవరైనా ఒక తోడు ఉంటే బాగుంటుంది అని పదేపదే శారద మందు ప్రస్తావించే వారట. ఇవన్నీ నాకు ఎందుకు ? చెబుతున్నారు అని శారద ప్రశ్నించిన కూడా చలం మాత్రం ఆమెను మాయలో పడేశారు. చివరకు ఒకరోజు మనిద్దరం పెళ్లి చేసుకుందాం అని శారద ముందు చలం ప్రపోజల్ పెట్టారు. చరలం మాయమాటలు నమ్మిన శారదా అక్కడ బెండ్ అయ్యారు.

చలం జీవితంలోకి రెండో భార్య‌గా వెళ్లారు. ఇదంతా సంబరాల రాంబాబు సినిమా టైంలో జరిగిన ప్రేమ కథగా చెబుతారు. ఆ తర్వాత రమణ చిత్ర అంటూ సొంతంగా బ్యానర్ ఏర్పాటు చేసి సినిమాలు నిర్మించారు. ఇది చలం మొదటి భార్య పేరు మీద ఏర్పాటు చేసిన బ్యానర్ కావటం విశేషం. మొదటి భార్యనే అంతగా గుర్తు పెట్టుకున్న చలం తనను ఇంకెంత బాగా చూసుకుంటారో అని శారద మురిసిపోయింది అట.

అయితే ఆ తర్వాత చలం లోని శాడిస్ట్ బయటికి వచ్చాడు. ప్రతిరోజు రాత్రిళ్ళు తాగి శారదను విపరీతంగా టార్చర్ పెట్టేవాడట. ప్రతిరోజు శారదను హింసించడంతోపాటు బాగా కొట్టేవాడట. చివరకు చలంలో మార్పు లేకపోవడంతో శారద విడాకులు ఇచ్చి అతని జీవితం నుంచి బయటకు వచ్చేసింది. జీవితం చివర దశలో చలం ఓ మలయాళీ నటిని ఉంచుకున్నాడట. ఆ టైంలో చలం కు విపరీతమైన అనారోగ్యం వచ్చింది. ఆయన బతకడం కూడా కష్టం అని వైద్యులు తేల్చి చెప్పారట.

ఆ సమయంలో ఆ మలయాళీ నటి నిద్రపోతున్నప్పుడు పెద్ద రుబ్బురోలు ఆమె నడుం మీద విసిరి కొట్టాడట. తన తర్వాత ఆ అమ్మాయి మరెవ్వరికీ దక్కకూడదని.. ఎవరికి ఉపయోగపడకూడదు అన్న దురుద్దేశంతోనే చలం అలా చేశాడని అంటారు. అంతా భయంకరమైన శాడిస్ట్ అయిన‌ చలం మాయమాటలు నమ్మి శారద అతడి జీవితంలోకి వెళ్లి పెద్ద తప్పు చేసిందని అంటారు.