సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా తెరకెక్కిన పుష్ప సినిమా పాన్ ఇండియా లెవెల్ లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిందో అందరికీ తెలుసు. ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 తెరకక్కనుంది. పుష్ప మూవీ సూపర్ హిట్ కావడంతో ప్రేక్షకుల్లో పుష్ప 2 పై అంచనాలు మరింతగా పెరిగాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ 50 శాతం పూర్తయిందని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా సీక్వెల్ కు సంబంధించిన అద్దిరిపోయే అప్డేట్స్ ను ఇచ్చాడు ఫహద్ ఫాసిల్.
పుష్ప సినిమాలో క్లైమాక్స్ లో నెగిటివ్ రోల్ లో భన్వర్ సింగ్ షేకావత్‌గా నటించాడు ఫహద్ ఫాసిల్. ఈ సినిమాలో ఓ టఫ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. పుష్ప 2 లో భన్వర్ సింగ్ – పుష్ప మధ్య ఫైట్ సీన్స్ మరింత ఆసక్తిగా ఉండబోతున్నాయి. ఈ సినిమాలో ఇద్దరి మధ్యన రెండు మూడు యాక్షన్ సీన్స్ ఉంటాయి. ఈ సినిమా పుష్ప కన్నా మరింత ఆసక్తిగా ఉండబోతుందని చెప్పుకొచ్చాడు ఫహద్ ఫాసిల్.
ఇప్పటికే ఈ సినిమాలో ఫహద్ ఫాసిల్‌కి సంబంధించిన సీన్స్ షూటింగ్ పూర్తయిపోయిందట. ఈ సినిమాలో జగపతిబాబు, అనసూయ కీ రోల్లో నట్టిస్తున్నారు. ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాపై జగపతిబాబు నటిస్తున్నాడన్నే వార్తలు రావడంతో మరింత అంచనాలు పెరిగాయి. ఇక ఈ సినిమా వచ్చే ఏడది వేసవిలో రిలీజ్ కాబోతుందని సమాచారం..!!