మెగాస్టార్ పాటకు ఇరగదీసిన గంగోత్రి చిన్నది.. బాస్ పాటకు స్టెప్పలంటే ఇలా ఉండాలి..!

అల్లు అర్జున్ హీరోగా వచ్చిన మొదటి సినిమా గంగోత్రి సినిమాతో బాలనటిగా టాలీవుడ్‌కు పరిచయమైన చిన్నారి కావ్య కళ్యాణ్ రామ్. పిల్లి కళ్ల‌తో ఎంతో ముద్దుగా ఉండే ఈ పాప ఇప్పుడు హీరోయిన్‌గా మరి వరుస విజయాలు అందుకుంటుంది. ఇప్పటికే మసూద, బలగం సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలను అందుకున్న ఈ గంగోత్రి చిన్నది. తాజాగా శ్రీ సింహ కోడూరికి జంటగా ఉస్తాద్‌ సినిమాలో నటిస్తోంది. ఇక ఈ ముద్దుగుమ్మ సినిమాలతో పాటు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటుంది.

నిత్యం హాట్ హ‌ట్‌ ఫోటోలను వీడియోలను తన అభిమానులతో పంచుకుంటూ రచ్చ రచ్చ చేస్తుంది. ఇప్పుడు తాజాగా కావ్య కళ్యాణ్ రామ్ బాస్ సాంగ్‌తో సోషల్ మీడియాలో ఓ వీడియోని షేర్ చేసింది. మెగాస్టార్ చిరంజీవి మెహర్ రమేష్ కాంబోలో వస్తున్న భోళా శంకర్ సినిమాలో చిరంజీవికి జంటగా తమన్నా నటిస్తుంది, కీర్తి సురేష్ చిరుకు చెల్లిగా నటిస్తుంది.

Balagam Actress Kavya Kalyan Ram is the Telugu Actress of the Year - NewsOrbit

ఈ సినిమాను ఆగస్టులో ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి భోళా భోళా అనే సాంగ్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ పాటలో చిరు తన మాస్ స్టెప్పులతో ఇరగదీశారు. ఇక ఇప్పుడు ఇదే సాంగ్‌కు కావ్య కళ్యాణ్ రామ్ అదిరిపోయే స్టెప్పులు వేసింది. డిటో మెగాస్టార్ ను తన డ్యాన్స్ లో దింపేసింది. బ్లూ కలర్ జీన్స్ పై బ్లాక్ కలర్ టీషర్ట్ దానిపై వైట్ షర్టుతో మాస్ స్టెప్పులతో అదరగొట్టింది.

ఇక భోళా హుక్ స్టెప్ కు అయితే మెగా ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియ‌లో వైరల్ గా మారింది. ఇక మెగా ఫ్యాన్స్.. బాస్ సాంగ్ కు డ్యాన్స్ అంటే ఇలా చేయాలి.. కావ్య పాప.. సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక మరి ఈ ముద్దుగుమ్మ ముందు ముందు స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదుగుతుందా లేదా అనేది చూడాలి.