ఇండస్ట్రీలో చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా భారీ స్థాయిలో అంచనాలు పెరగాలంటే టైటిల్ కూడా అద్భుతంగా ఉండాలి. సినిమా సక్సెస్ సాధించింది అంటే దానికి టైటిల్ పాత్ర కూడా ఉంటుంది. కేవలం సినిమా టైటిల్ ద్వారా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు కొల్లగొట్టిన సినిమాలు కూడా ఎన్నో ఉన్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో షార్ట్ టైటిల్స్ ట్రెండ్ నడుస్తుంది.
డైరెక్టర్ రాజమౌళి సైతం చిన్న టైటిల్స్ తన సినిమాలకు ఫిక్స్ చేసి హిట్లర్ తన ఖాతాలో వేసుకున్నాడు. అలా ఒకే ఒక అక్షరంతో ఎన్నో టాలీవుడ్ సినిమాలు రిలీజై మంచి సక్సెస్ సాధించాయి. అలా సింగిల్ లెటర్‌తో టైటిల్ పెట్టి బ్లాక్ బాస్టర్ హిట్ సొంతం చేసుకోవడం సాహసం అనే చెప్పాలి. అలా సింగల్ టైటిల్‌తో తెరకెక్కిన సినిమాలేవో ఒకసారి చూద్దాం.
పవన్ కళ్యాణ్ – సాయి ధరంతేజ్ మల్టీస్టారర్ బ్రో సినిమా సింగిల్ లెటర్‌తో రిలీజై రీసెంట్గా బాక్సాఫీస్ వద్దకు వచ్చి ఓకే టాక్ తెచ్చుకుంది. నితిన్ – రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కిన సై, ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో కాజల్, రెజినా కీ రోల్స్ ప్లే చేసిన అ!, మంచి విష్ణు, జెనీలియా హీరో హీరోయిన్లుగా నటించిన ఢీ, విక్రమ్ ఐ, కళ్యాణ్ రామ్ ఓం, జగపతిబాబు కీ, ఉపేంద్ర రా, ఏ – ధనుష్ 3, శ్రీ పూర్ణ మూవీస్ బ్యానర్ పై రిలీజ్ అయిన స్త్రీ ఇలా ఎన్నో సింగిల్ లెటర్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ సాధించాయి.
జి, క్యూ అనే టైటిల్ తో కొన్ని సినిమాలు రూపొందించగా ఈ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అయ్యాయి కూడా తెలియదు. రాబోయే రోజుల్లో సింగిల్ టైటిల్ తో ఎన్నో సినిమాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ బ్రో టైటిల్ తో గతంలో నవీన్ చంద్ర – అవికా గోర్ నటించిన సినిమా ఎప్పుడు రిలీజ్ అయిందో కూడా చాలా మందికి తెలియదు.