ఎన్టీఆర్ నుంచి సైఫ్ వ‌ర‌కు వెండితెరపై రావణ బ్రహ్మ పాత్ర పోషించిన హీరోలు వీరే..ఎవరు టాప్ అంటే..!

అన్ని అవతారాల్లో రామ అవతారం ఎంతో ఉన్నతమైనది. ఈ అవతారంలో ఎన్నో మానవీయ విలువలు మరెన్నో సంస్కృతి సంప్రదాయాలు, కుటుంబ వ్యవస్థలోని విశిష్టత, అనుబంధాలు రామాయణం చూస్తే అందరికీ అర్థమవుతుంది. రామాయణం అంటే కేవలం ఒక రాముడు మాత్రమే కాదు.ఎన్నో గొప్ప పాత్రలు గొప్ప విశిష్టతలు ఉన్నాయి. రామాయణ కావ్యం భారతీయులకు ఎంతో పవిత్ర గ్రంథం. ఇందులో ఉన్న ప్రతి భాగం ప్రతి ఒక్కరికి నీతిని బోధిస్తుంది. ధర్మంగా ఎలా నడుచుకోవాలో రామాయణం చూస్తే అందరికీ అర్థమవుతుంది.

రామాయణం అంటే రాముడు మాత్రమే కాదు రావణాసురుడు కూడా.. రాముడు ధర్మం వైపు ఉంటే రావణాసురుడు అధర్మం వైపు ఉన్నాడు. ఎప్పుడు ధర్మమే విజయం సాధిస్తుంది. కానీ ఎంత అధర్మపరుడైన రావణాసురుడు గొప్ప శివ భక్తుడు.. గొప్ప గుణాలు ఉన్న పర స్త్రీపై ఉన్న వ్యామోహం అనే దుర అలవాటుతో పతనం అయిపోయాడు. ఇలాంటి ఎన్నో గొప్ప గుణాలున్న ఈ పాత్రను వెండితెరపై ఎంతోమంది ఎన్నోసార్లు రామాయణ కావ్యాన్ని తెరకెక్కించారు. రావణాసురుడు పాత్రలో నటించిన వారు ఎందరో ఉన్నారు అలా నటించిన వారు ఎవరో ఒకసారి చూద్దాం రండి.

మన తెలుగు తెర‌పై రాముడు అంటే ఎన్టీఆర్ ఆయన కేవలం రాముడు గానే కాదు కృష్ణుడుగా రావణాసురుడిగా, దుర్యోధనుడుగా ఎన్నో విభిన్న పౌరాణిక పాత్రలో నటించి మెప్పించారు. ఎన్టీఆర్ కూడా భూకైలాస్ సినిమాలో తొలిసారిగా రావణాసుడు పాత్రలో నటించారు. ఆ తర్వాత ఆయన స్వీయ దర్శకత్వంలో వచ్చిన సీతారామ కళ్యాణం, శ్రీకృష్ణసత్య, శ్రీరామ పట్టాభిషేకం, బ్రహ్మర్షి విశ్వామిత్ర వంటీ పలు సినిమాల్లో రావణాసురుడిగా నటించి అలరించారు.

 

మరో తెలుగు దిగ్గజ నటుడు ఎస్.వి.రంగారావు కూడా బాబు దర్శకత్వంలో శోభన్ బాబు హీరోగా వచ్చిన సంపూర్ణ రామాయణం సినిమాలో రావణాసురుడి పాత్రలో నటించి మెప్పించాడు. కన్నడ దిగ్గజ నటుడు డాక్టర్ రాజకుమార్ కూడా కన్నడలో వచ్చిన భూ కైలాస్ అనే సినిమాలో రావణబ్రహ్మ పాత్రలో నటించి మెప్పించారు. మరో తెలుగు దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణ కూడా బాపు దర్శకత్వంలో వచ్చిన సీతా కళ్యాణం అనే సినిమాలో రావణాసుడి పాత్రలో నటించి ఆలరించించారు.

అలాగే నట‌సింహ నందమూరి బాలకృష్ణ కూడా దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో వ‌చ్చిన‌ పరమవీరచక్ర సినిమాలో రావణబ్రహ్మ పాత్రలో కనిపించాడు. ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో కూడా కాసేపు రావణాసుడి పాత్రలో కనిపించాడు. మెగా బ్రదర్ నాగబాబు కూడా రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన శ్రీరామదాసు సినిమాలో కాసేపు రావణాసుడి పాత్రలో నటించాడు. అలాగే గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన బాల రామాయణంలో స్వాతి అనే అమ్మాయి రావణాసురుడి పాత్రలో నటించింది. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాల రాముడుబాల రాముడు గా కనిపించాడు.

ఇక దూరదర్శన్‌లో వచ్చిన రామాయణం సీరియల్ లో అరవింద్ త్రివేది రావణాసుర పాత్రలో నటించి మెప్పించారు. శ్యామ్ బెనగళ్ దర్శకత్వంలో ధూరదర్శన్ కోసం తెరకెక్కించిన ‘భారత్ ఏక్ కోజ్’ సీరియల్‌లో ఓంపురి రావణ బ్రహ్మ పాత్రలో నటించి మెప్పించడు. ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ శ్రీరాముడిగా నటించిన ‘ఆదిపురుష్’ సినిమా సైఫ్ అలీ ఖాన్.. లంకేషుడి పాత్రలో నటించారు. ఈ పాత్రపై పలు విమర్శలు కూడా వచ్చాయి. ఈ విధంగా వెండితెరపై ఎంతోమంది నటులు రావణబ్రహ్మ పాత్రలో నటించి అలరించారు.ఇంతమంది అగ్ర నటులు రావణాసురుడి పాత్రలో నటించి విమర్శలు తెచ్చుకోకపోయినా రీసెంట్ గా వచ్చిన ఆదిపురుష్‌ సినిమాలో మాత్రం సైఫ్ అలీ ఖాన్ పాత్ర మాత్రం విమర్శల పాలైంది.