నటసింహ నందమూరి బాలకృష్ణ నటరత్న ఎన్టీఆర్ నట వారసుడుగా తాతమ్మకల సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాడు. ఇక అప్పట్నుంచి నేటి వరకు తన తండ్రి ఎన్టీఆర్‌కు తగ్గ నటుడుగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నాడు. అంతేకాకుండా తెలుగులో ఏ హీరోకు లేని మాస్ ఇమేజ్ సంపాదించుకునీ ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలకు కూడా తన సినిమాలకు పోటీ ఇస్తున్నాడు.. అంతేకాకుండా టాలీవుడ్ తన సినిమాలతో ఎన్నో సంచలన రికార్డులను క్రియేట్ చేశాడు.
2001లో బి.గోపాల్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన‘నరసింహనాయుడు’ సినిమా రూ. 21.75 కోట్ల షేర్ సాధించింది. తెలుగులో తొలి రూ. 20 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన సినిమాగా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. 1999లో బి. గోపాల్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘సమరసింహారెడ్డి’ సినిమా కూడా టాలీవుడ్‌లోనే తొలి రూ. 17 కోట్ల షేర్ సాధించిన సినిమా రికార్డులకు ఎక్కింది.
1989లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో నందమూరి నట సింహం బాలయ్య హీరోగా వచ్చిన ‘ముద్దుల మావయ్య’ సినిమా కూడా రూ. 5.5 కోట్ల షేర్ సాధించి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. 1984లో ఎన్టీఆర్ హీరోగా బాలకృష్ణ ముఖ్యపాత్రలో నటించిన ‘శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర’ సినిమా కూడా రూ. 4.50 కోట్ల కలెక్షన్లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 1984లో మరో సారి కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మంగమ్మ గారి మనవడు’ దాదాపు రూ. 4 కోట్లకు పైగా షేర్ సాధించి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. సోలో హీరోగా బాలయ్యకు ఇది మొదటి వంద రోజులు.
సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, డైమండ్ జూబ్లీ సినిమాగా రికార్డులకు ఎక్కింది. మొత్తంగా నందమూరి బాలకృష్ణ.. తన తండ్రి ఎన్టీఆర్‌తో కలిసి నటించిన ‘శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర’ మూవీతో కలిపి ఐదు ఇండస్ట్రీ హిట్స్ నమోదు చేసారు. ఇప్పటికీ వరుస సినిమాలు చేసుకుంటూ తనదైన రికార్డులతో దూసుకుపోతున్నాడు బాలయ్య.. ప్రస్తుతం తన 108వ సినిమాను స్టార్ దర్శకుడు అనిల్ రావిపూడి తో చేస్తున్నాడు. ఈ సినిమాతో మరోసారి హ్యాట్రిక్ హిట్‌ను అందుకోవడానికి బాలయ్య రెడీగా ఉన్నాడు.