బ‌రువు త‌గ్గాలంటే పొద్దున్నే లేచి ఈ చిన్న ట్రిక్ ప్లే చేస్తే చాలు…!

రోజు లేచిన వెంటనే సోంపొ నీటిని తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. సోంపు నీటిని తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. సోంపు గింజల్లో ఎన్నో ఆరోగ్య పోషకాలు దాగి ఉన్నాయని. అందుకే సోంపు నీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచి జరుగుతుంది. భోజనం చేసిన తర్వాత సోంపు గింజలను తినడం వల్ల బరువు తగ్గించడానికి సహాయపడతాయట.

సోంపులో క్యాలరీలు చాలా తక్కువగా ఉండి ఫైబర్ కంటెంట్ మాత్రమే ఎక్కువగా ఉండడంతో ఇవి బరువు తగ్గించే లక్షణాలను కలిగి ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. ఇక మన ఆకలిని నియంత్రించి ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండేలా సోంపు సహాయపడుతుంది. అలాగే పరగడుపున సోంపు నీటిని తాగడం వల్ల బరువు తగ్గుతారు అంటున్నారు నిపుణులు.

ఎన్నో ఔషధ గుణాలు కలిగిన సోంపు ఒక మసాలా దినుసు. సోంపు గింజల్లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉండడంతో పరగడుపున సోంపు గింజలు నీటిని తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఉదయాన్నే ఒక గ్లాసు సోంపుతా నీరు తాగడం వల్ల జీర్ణ క్రియ మెరుగ్గా ఉంటుంది. గ్యాస్, కడుపులో నొప్పి, అజీర్ణం లాటి సమస్యల నుంచి ఉపసమ‌నం లభిస్తుంది.

ఈ వాటర్ జీర్ణ ప్రక్రియను ఉత్తేజ పరచడానికి అలాగే జీర్ణాశయం లోపల పేగు భాగాలు మొత్తం ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది. సోంప్ లో ఫినోలిక్ కాంపౌండ్స్ , ఫాలినాయిడ్స్ అధికంగా ఉండడంతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. సొంపులో ఉండే ఈ యాంటి అక్సిడెంట్లు బాడీ ఆక్సిడేషన్ ప్రెషర్ నియంత్రించడానికి ఉపయోగపడతాయి. సోంపులో కరిగే ఫైబర్ అధికంగా ఉండడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి , మెరుగుపరచడానికి సోంపు సహాయపడుతుంది.

బీటా కెరోటిన్ ఎక్కువ మోతాదులో ఉండి టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారిలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. మరొక యాంటీఆక్సిడెంట్ పొటాషియం కూడా సోంపులో అధికమోతాదులో ఉంటుంది. ఇది సహజంగా బ్లడ్ ప్రెషర్ ను నియంత్రించడానికి.. శరీరంలోని ఆమ్ల‌ సామర్థూల్యతను నియంత్రించడానికి సోంపు ఉపయోగపడుతుంది. సోంపు గింజలు రోజు నమ‌ల‌డం వల్ల బ్లడ్ ప్రెషర్ హెల్తీ రేంజ్ లో ఉంటుంది.