యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తర్వాత తన 30వ సినిమా స్టార్ దర్శకుడు కొరటాల శివతో చేస్తున్నాడు. ఇక రీసెంట్ గానే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు ఈ సినిమా టైటిల్ కూడా అనౌన్స్ చేశారు. దేవర అనే పవర్ ఫుల్ టైటిల్ తో వస్తున్నఈ సినిమా వచ్చే సంవత్సరం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇదే సమయంలో ఈ సినిమా నుంచి ఎన్నో ఇంట్రస్టింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి.
ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే కొరటాల ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెంచేశాడు. ఇదే సమయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొందరు ఈ సినిమాని హాలీవుడ్ మూవీ ‘ సిసు ‘ నుంచి ఈ సినిమా నుంచి ఇన్స్పైర్ అయ్యి తెరకెక్కిస్తున్నారని చర్చ జరుగుతోంది. సిసు లోని యాక్షన్ సన్నివేశాలు ఎవర్ గ్రీన్ అన్నట్లుగా ఉంటాయి. ఆ సన్నివేశాలను పోలిన యాక్షన్ సన్నివేశాలను దేవరలో కొరటాల ఉపయోగించే అవకాశాలు ఉన్నాయని చర్చ కూడా జరుగుతోంది.
ఇటీవల ఇతర భాషల నుంచి ఇన్స్పైర్ అయ్యి అదే కథతో సినిమాలు చేయటం కొత్తేమీ కాదు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ తో చేయబోయే దేవర సినిమాని కూడా కొరటాల సిసు సినిమా నుంచి తీసుకుని తెరకెక్కిస్తున్నారని అలా తెరకెక్కిస్తే ఎలాంటి ? అభ్యంతరం లేదు అన్నట్లుగా మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటివరకు కొరటాల ఎన్టీఆర్ తో చేయబోయి దేవర స్టోరీ ఏంటి ? అనేది ఎవరికీ చెప్పలేదు.. సినిమా బ్యాక్ గ్రౌండ్ ఏంటి ఇలా ఏ ఒక్క విషయం గురించి కూడా క్లారిటీ లేదు.
అభిమానులు ఈ విషయం గురించి పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. ఇప్పటి వరకు ఆ విషయమై ఎలాంటి స్పష్టత లేదు. కానీ సిసు సినిమా నుంచి ఇన్స్పైర్ అయి ఉంటే మాత్రం ఎన్ఠీఆర్ ఫ్యాన్స్ కి ఇక పండగే అని సినిమా వర్గాలు అంటున్నాయి. కొరటాల ఈ సినిమాతో ఎన్టీఆర్ ను ఒక రేంజ్లో ఎలివేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే బాక్సాఫీస్ వద్ద బాక్సులు బద్దలవ్వడం ఖాయం.