ఏపీ, తెలంగాణ‌ను క‌మ్మేస్తోన్న కండ్ల‌క‌ల‌క‌… ఈ జాగ్ర‌త్త‌ల‌తో చెక్‌..!

పెరిగిన వానల‌ కారణంగా నీటి ద్వారా వ్యాపించే అంటూ వ్యాధులు ఎక్కువవుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రోజుకి వేల‌ల్లోనే కంటి కల‌కల కేసులు న‌మోదు అవుతున్నాయి. పెరిగిన నీటిలోని తేమ కారణంగా వచ్చే కళ్ళ కలక నివారణ చర్యలు ఏంటో ఒకసారి చూద్దాం. పదేపదే చేతులను కడుక్కుంటూ ఉండాలి. ఏదైనా పని చేసినప్పుడు, వస్తువుని తాకినా, లేదా వాష్ రూమ్ యూస్ చేసుకున్న తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవడం మంచిది.

కళ్ళను రుద్దడం, తరచూ నడపడం లాంటి అలవాట్లను మానుకోవాలి. కళకల‌క‌ సోకిన వ్యక్తి నీళ్లు కాచి చల్లార్చి దూదితో కళ్ళను తుడుచుకోవాలి. ఉతికిన టవల్స్, కర్చీఫ్ లు మాత్రమే వినియోగించాలి. ఒకరి ఐలాష‌స్‌, ఐ కాంటాక్ట్ లెన్సెస్ కళ్లకు సంబంధించిన మేకప్ ఐటమ్స్ ఏవి మరొకరితో షేర్ చేసుకోకండి. కళకల‌క‌ ఉన్నవారు అది తగ్గే వరకు కళ్ళజోడు పెట్టుకోవడం మంచిది. కలలో విపరీతమైన దురద, మంట ఉంటే వెంట‌నే డాక్టర్‌ని సంప్రదించాలి.

నీటి ద్వారా వ్యాపించే కంటికలక ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే భారీ వర్షం సమయంలో బయటకు వెళ్లకుండా ఉండడం మంచిది. తప్పక వెళ్లాల్సి వస్తే సన్ గ్లాసెస్ లాంటి రక్షక కళ్లద్దాలను ధరించండి. వాతావరణానికి తగ్గట్టుగా సరైన ఆహారం తీసుకోవాలి. ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉండే ఆహారంతో పాటు విటమిన్ ఏ.. ఎక్కువగా ఉండే ఆహారాన్ని సేవించండి. విటమిన్ ఏ కళ్ళకు ఎంతగానో మేలు చేస్తుంది. ఆకుపచ్చ ఆకుకూరలు , కూరగాయలు తీసుకోవాలి.