నందమూరి వంశం నుంచి పోస్టర్‌ను హీరోలు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు కానీ ఎవరూ ఎన్టీఆర్ వారి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లలేకపోయారు. కానీ నందమూరి బాలకృష్ణ ఒక సింహంలా ఆ ఫ్యామిలీ ఉనికిని ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీలో ఉంచగలుగుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సంగతి పక్కన పెడితే బాలకృష్ణ ఎప్పటినుంచో బ్లాక్‌బస్టర్ హిట్స్ సాధిస్తూ దూసుకెళ్తున్నాడు. మొన్నీమధ్యే వరుసగా రెండు హిట్స్ సాధించాడు.
ఇప్పుడు ఈ “లయన్” మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేందుకు రెడీ అయ్యాడు. ఈ నందమూరి అందగాడు ఓ భారీ యాక్షన్ సినిమా కోసం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో జత కట్టాడు. వాల్తేరు వీరయ్య ఫేమ్ బాబీ కొల్లి డైరెక్షన్‌లో ఈ సినిమా రూపుదిద్దుకొనుంది. దీనిని సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూజా కార్యక్రమాలను నిర్వహించి ఈ అప్‌కమింగ్ సినిమాను బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా లాంచ్ చేశారు.
ఈ పూజా కార్యక్రమంలో స్క్రిప్ట్‌ను దర్శకుడు వి.వి. వినాయక్ మూవీ టీమ్‌కి అందించాడు. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫస్ట్ షాట్‌కి దర్శకత్వం వహించాడు. ఇదే సందర్భంగా మూవీ టీమ్ సినిమా కాన్సెప్ట్ ఏంటి అనేది తెలిపేలా ఒక పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌లో లిక్కర్ బాటిల్, గొడ్డలి, ఇతర మారణాయుధాలు కనిపించాయి. దీన్ని బట్టి బాలయ్య బాబు ఎంత మాస్ యాక్షన్ అవతారంలో కనిపిస్తారో తెలుస్తోంది. కాన్సెప్ట్ పోస్టర్‌తోనే బాలయ్య అభిమానుల్లో హైప్ పెంచినట్లు కూడా అర్థమవుతోంది.
ఇక ఈ సినిమా ”వయలెన్స్ కా విజిటింగ్ కార్డ్” అనే టాగ్ లైన్‌తో రానుంది. అంతేకాకుండా “ప్రపంచానికి అతను తెలుసు కానీ అతను ప్రపంచంలో ఎవరికీ తెలియదు” అనే ఒక ఇంట్రెస్టింగ్ లైన్ కూడా ఈ పోస్టర్‌లో జోడించారు. దీన్ని బట్టి ప్రజలకు అండదండగా ఉండే బాలయ్య చెడు వ్యక్తులను నాశనం చేయడానికి అత్యంత ఉగ్రరూపం దాల్చుతాడని తెలుస్తోంది.