చిత్ర పరిశ్రమలో ఎందరో హీరోలు ఎన్నో రకాల పాత్రలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. అలాంటి అగ్ర నటులలో అక్కినేని నాగేశ్వరరావు కూడా ఒకరు. ఇక మన తెలుగు చిత్ర పరిశ్రమ కి రెండు కళ్ళు లాంటి వారిని ఎన్టీఆర్- అక్కినేని నాగేశ్వరరావు ని చెప్పుకుంటూ ఉంటారు. అందులో అక్కినేని నాగేశ్వరరావు అప్పట్లో లవర్ బాయ్ సినిమాలు ఎక్కువగా చేస్తూ ఎన్నో ప్రేమ కథ సినిమాలో హీరోగా నటించిడు. నాగేశ్వరరావు అంటే అమ్మాయిలు ఎంతో ఇష్టపడేవారు.
అయితే ఏఎన్ఆర్ తన సిని కేరీర్‌లో ఎన్నో రకాల వైవిధ్యమైన పాత్రలో నటించి వాటికి మంచి గుర్తింపు తెచ్చారు. ఏఎన్ఆర్ ఎప్పుడైతే సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు అప్పటినుంచి అయినా అన్ని క్యారెక్టర్ లో నటిస్తూ వచ్చారు.కానీ ఆయన తన కెరీర్లు కొన్ని సినిమాలు అసలు చేయకూడదని, అలాగే కొన్ని క్యారెక్టర్ లో నటించకూడదని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారట.
ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కలిసి నటించిన భూకైలాస్ సినిమాలో నాగేశ్వరరావు నారదుడి పాత్రలో నటించాడు. ఈ సినిమా మొత్తం దాదాపు ఆయన అన్ని సన్నివేశాల్లో కనిపించే పాత్ర రావడంతో అయినా పాత్ర కోసం ప్రాణం పెట్టి నటించాడు. ఆ పాత్ర చేసినందుకు ఆయనకి మంచి పేరు వచ్చినప్పటికీ ఆ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ గా మిగిలిపోయింది. అంత మంచి గా నటించినా సినిమాలా ప్లాఫ్ అవడంతో నాగేశ్వరరావు అప్పటినుంచి నారదుడు పాత్రలో నటించడం మానేశాడు.
అదేవిధంగా పౌరాణిక సినిమాల్లో కూడా చేయటం మానేశాడు. అయనకు నచ్చిన సాంఘిక సినిమాల్లోనే నటించడం మంచిదని డిసైడ్ అయ్యారట. అప్పటి నుంచి అలాంటి సినిమాల్లో మాత్రమే నటిస్తూ వచ్చారు. ఈ విషయంపై ఆయన మనసు మార్చుకోమని ఎందరో అగ్ర దర్శకులు చెప్పిన ఆయన వాటిని పట్టించుకోలేదట. అలా నాగేశ్వరావుకి చెప్పిన వారిలో సావిత్రి గారు కూడా ఒకరు.. కానీ ఏఎన్ఆర్ మాత్రం ఎవరు చెప్పినా తన పట్టుదలను మాత్రం వీడలేదట.
తన చివరి విశ్వాస వరకు పౌరాణిక సినిమాల్లో నాగేశ్వరరావు అసలు నటించలేదు. అందుకే చిత్ర పరిశ్రమలో మాట మీద నిలబడిన ఒకే ఒక వ్యక్తిగా నాగేశ్వరరావు అని చెప్పుకుంటూ ఉంటారు. అంతేకాకుండా తన జీవితంలో మధ్యం కూడా తాగని తీసుకున్న నిర్ణయాన్ని కూడా తన చివరి శ్వాస వరకు కట్టుబడి ఉన్నారు నాగేశ్వరావు.