లక్ష్మీ కటాక్షం` సినిమా ఒక రేంజ్లో తెలుగు సినిమా రంగాన్ని ఊపేసింది. ఈ సినిమాలు దాదాపు అన్ని పాటలు కూడా సి. నారాయణరెడ్డే రచించారు. ప్రతి పాటాకూడా సూపర్ హిట్టయింది. అప్పటికి కొత్తగా టేపు రికార్డర్లు వస్తున్న సమయం కావడంతో ఈ సినిమా పాటల క్యాసెట్లు జోరుగా అమ్ముడయ్యాయి. తర్వాత.. కొన్నాళ్లకు సినిమా డైలాగులతో కూడిన క్యాసెట్లను కూడా రిలీజ్ చేసి.. క్యాష్ చేసుకున్నారు.
పూర్తిస్థాయిలో జానపద సినిమాగా తెరకెక్కిన లక్ష్మీ కటాక్షం.. ఊహించని విధంగా ఆడింది. నిజానికి ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేకుండానే తెరకెక్కించారు. కేవలం అన్నగారితో సినిమా చేయాలనే ఒకే ఒక్క నిశ్చయం తప్ప.. మరేమీ లేదు. అయితే, అనుకోకుండానే సినిమా హిట్టయింది.
ఇదిలావుంటే… సినిమాపై ముందు అనుకున్న రేంజ్లో అంచనాలు లేక పోవడంతో అన్నగారి సరసన నటించేందుకు ఇష్టం ఉన్నా.. చాలా మంది హీరోయిన్లు.. ఈ సినిమాను వదులుకున్నారు. చివరకు కేఆర్ విజయను హీరోయిన్గా ఎంచుకున్నారు. కధ విన్నాక.. పెదవి విరిచిన విజయ కూడా.. నటించేందుకు పెద్దగా ఇష్టపడలేదు.
ఎట్టకేలకు నిర్మాతలు ఆమెను ఒప్పించినా.. పారితోషికం విషయంలో మాత్రం అన్నగారితో ఆమె పోటీ పడింది. హీరోకు ఎంత ఇస్తున్నారో.. నాకు కూడా అంతే ఇవ్వాలంటూ.. కేఆర్ విజయ పట్టుబట్టి వసూలు చేసిన ఏకైక సినిమా ఇదేనట. మొత్తానికి సినిమా హిట్ కావడంతో నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు.