సైలెంట్ షాక్ ఇచ్చిన హైపర్ ఆది.. యాంకర్ చెల్లితో నిశ్చితార్థం.. పూర్తి వివరాలు ఇవే..?

జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన హైపర్ ఆది ఈ షోతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూనే టాప్ పొజిషన్ దక్కించుకున్న ఆది పాలిటిక్స్ లో కూడా అడుగు పెట్టాడు. సినిమా ఇండస్ట్రీలో మినిమం హీరో ఫాన్ ఫాలోయింగ్ కంటే హైపర్ ఆది క్రేజ్ ఎక్కువ. ఓ పక్కన జబర్దస్త్, మరోపక్క పాలిటిక్స్ , మరోపక్క ఈవెంట్స్ అంటూ బిజీ బిజీగా గడుపుతున్న హైపర్ ఆదికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

హైపర్ ఆది ఎవరిని పెళ్లి చేసుకుంటాడో..?ఎప్పుడు చేసుకుంటాడో..? అనేదానిపై ప్రేక్షకుల్లో చాలా ఆసక్తి ఉంది. ప్రస్తుతం హైపర్ ఆది పెళ్లికి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. యూట్యూబ్ ఛానల్ లో యాంకర్ గా తన కెరీర్ ని స్టార్ట్ చేసిన ఓ ఫిమేల్ యాంకర్ తో హైపర్ ఆదికి పరిచయం ఏర్పడిందట. ఆమె ద్వారా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకునాడు ఆది. ఈ క్రమంలో ఆమెతో పరిచయం మరింత బలపడిందని తర్వాత వీరిద్దరూ ఒకరితో ఒకరు ప్రేమలో పడ్డారని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయిందట. ఆ యాంకర్ వాళ్ళ అక్క కూడా మరో యాంకర్ కావడం విశేషం. దీంతో ఇండస్ట్రీలో టాప్ సెలబ్రిటీగా పేరు సంపాదించుకున్న హైపర్ ఆది ఒక టాప్ సెలబ్రిటీనే పెళ్లి చేసుకుంటాడు అనుకున్న అభిమానులకు యూట్యూబ్ ఛానల్ యాంకర్ ని పెళ్లి చేసుకోబోతున్నాడని వార్త తెలియడంతో షాక్ అవుతున్నారు.