టాలీవుడ్‌లో తొక్కేస్తున్నారు… ఈషా రెబ్బా టార్గెట్ చేసింది ఎవ‌రిని.. !

టాలీవుడ్ హీరోయిన్ ఈషా రెబ్బా తెలుగు అమ్మాయే అన్న సంగతి తెలిసిందే. ఈషా అమీతుమీ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. తర్వాత అరవింద సమేత, రాగల 24ల గంటల్లో లాంటి సినిమాల్లో నటించి సత్తా చాటుకుంది. సరైన గ్రామర్ రోల్‌లో న‌టించే అవ‌కాశం ఇప్పటివరకు ఆమెకి దక్కలేదు. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈషా ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ యువతను ఫిదా చేస్తోంది. సోషల్ మీడియాలో క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఈషా సొంతం.

తెలుగులో డస్కీ బ్యూటీగా పేరు సంపాదించుకున్న ఈషా ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను తమిళ, మలయాళ భాషల్లో నటిస్తున్నాను.. అక్కడ వారు తెలుగు సినిమా గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటుంటే నాకు గర్వంగా అనిపిస్తుంది… మన తెలుగు మూవీ మేకర్స్ మాత్రం ఎక్కువగా నార్త్ లేదా మరి ఇతర భాషల హీరోయిన్లనే తీసుకుంటున్నార‌ని వాపోయింది.

కేవలం హీరోయిన్ల పాత్రలకే కాకుండా ఇతరుల పాత్రలకు కూడా నార్త్ వాళ్ళని తీసుకుంటున్నారని.. టాలెంట్ ఉన్న నటీనటులు తెలుగులో చాలామంది ఉన్నా వారికి గుర్తింపు లేద‌ని చెప్పింది. వారిని పక్కన పెట్టేసి నార్త్ వాళ్ళను తీసుకోవడం బాధాకరంగా ఉందంటూ ఈషా వాపోయింది. గతంలో తెలుగు అమ్మాయి మంచు లక్ష్మి కూడా ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ హీరోయిన్ల గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది.

టాలీవుడ్ లో ఎక్కువగా నార్త్ లేదా ఇతర భాషల హీరోయిన్ల హ‌వా నడుస్తుంది.. కానీ ఇక్కడ పుట్టి పెరిగిన తెలుగు హీరోయిన్లకు మాత్రం అవకాశాలు రావడం లేదు.. వారు టాలీవుడ్ లో రాణించలేకపోతున్నార‌ని త‌న బాధ వెళ్ల‌గ‌క్కింది. తాజాగా ఈషా కూడా అదే విధంగా స్పందించడంతో ఈ వాదన నిజం అని ప‌లువురు ఈషాకు స‌పోర్ట్ చేస్తున్నారు.

టాలీవుడ్ లో తెలుగు వారిని తొక్కేస్తున్నారు అని ఈషా రెబ్బ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో టాలీవుడ్ లో ఈషా టార్గెట్ చేసింది ఎవరిని? నిజంగానే తెలుగు నటులకు మేకర్స్ ఎందుకు అవకాశాలు ఇవ్వడం లేదు? కావాలనే వారిని తొక్కేస్తూ నిజంగా తప్పు చేస్తున్నారా? అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.