మంచు బ్ర‌ద‌ర్స్ గొడ‌వ‌ల‌కు ఫుల్‌స్టాప్ ప‌డ‌దా… ఎంత బ‌ద్ధ‌ శ‌త్రువుల‌గా మారారంటే…!

డైలాగ్ కింగ్ మోహన్ బాబు తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మోహన్ బాబు ఫ్యామిలీ అంటే డిసిఫ్లెయిన్ కి మారుపేరు. కాని గ‌త‌ కొంతకాలంగా మంచు ఫ్యామిలీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మొద‌టి భార్య ప్ర‌ణ‌తిరెడ్డి నుంచి విడాకులు తీసుకున్న మంచు మనోజ్ పెళ్లయి ఒక కొడుకు ఉన్న భూమా మౌనిక రెడ్డిని వివాహం చేసుకోవడంతో సోషల్ మీడియాలో నిన్న మొన్నటి వరకు వైరల్ అవుతూనే ఉన్నాడు మ‌నోజ్.

Mohan Babu M on Twitter: "Manchu family wishes you all a very "Happy Vinayaka Chavithi" #HappyVinayakaChavithi #HappyGaneshChaturthi https://t.co/uoysLRTlWF" / Twitter

ఎన్నో సంవత్సరాలు ప్రేమించుకుని ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాత ప్రేమలో పడి ఇంట్లో పెద్దలను ఒప్పించి మరీ వీళ్లు పెళ్లి చేసుకున్నారు. పైగా మౌనిక కొడుకుని తన సొంత కొడుకులా చూసుకుంటానని మాట ఇచ్చాడు మంచు మనోజ్. కాగా ఈ పెళ్లి అసలు మంచు విష్ణుకు ఇష్టం లేదని ఆ కారణంతోనే మంచు మనోజ్ పెళ్లికి చుట్టం చూపుగా వచ్చి వెళ్లిపోయాడ‌న్న పుకార్లు కూడా వ‌చ్చాయి.

Manchu family moves to Shamshabad residence | Telugu Movie News - Times of India

 

మనోజ్ రెండో పెళ్లి మంచి ఫ్యామిలీకి అసలు ఇష్టం లేదని.. అయినా మనోజ్ కోసం ఈ పెళ్లికి మోహన్ బాబు దంపతులు వచ్చి వెళ్లారంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ఆ త‌ర్వాత కూడా మ‌నోజ్‌, విష్ణు మ‌ధ్య పెద్ద గొడ‌వ జ‌ర‌గ‌డం.. విష్ణు ఓ ఇంటికి వెళ్లి గొడ‌వ‌కు దిగిన వీడియో కూడా వైర‌ల్ అయ్యింది. ఇక తాజాగా మంచు డాటర్ మంచు లక్ష్మి ఈ వార్తలపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియా వేదిక ఒక నెటిజన్ ఆమెను అడిగిన క్వశ్చన్ కు ఆస‌క్తిక‌రంగా బ‌దులిచ్చింది.

Mohanbabu Deadline to Manchu Manoj

 

మంచు ల‌క్ష్మి ఇచ్చిన ఆన్స‌ర్ కూడా ఈ పెళ్లి విష్ణుకు ఇష్టం లేక‌పోవ‌డంతోనే గొడ‌వ జ‌రిగిన‌ట్టుగా ఉంది. ఇక ఈ పెళ్లికి ల‌క్ష్మి అంతా తానై వ్య‌వ‌హ‌రించారు. దీంతో మంచు బ్ర‌ద‌ర్స్ మ‌ధ్య పెళ్లి విష‌యంలో గొడ‌వ‌లు జ‌రిగిన మాట నిజ‌మే అని… మ‌రోసారి ఈ గుట్టు బ‌య‌ట ప‌డింద‌ని అభిప్రాయానికి అంద‌రూ వచ్చేసారు. అన్నదమ్ముల మధ్య జరిగే గొడవలలో మంచు లక్ష్మి ఎవరి ? వైపు ఉంటార‌న్న‌ది కూడా చ‌ర్చ‌గా మారింది.

The death of Mohan Babu's first wife Vidya Devi... What a story happened behind the marriage with Nirmala Devi..! » Jstimesnow

 

చాలామంది మంచు మనోజ్ తో మంచు లక్ష్మికి ఉన్న బాండింగ్ ఎక్కువ కాబట్టి మనోజ్ వైపే నిలబడుతుంద‌న్న‌ కామెంట్స్ చేస్తున్నారు. మనోజ్, మంచు విష్ణు మధ్య గొడవ జరిగినప్పటి నుంచి ఒకరికి ఒకరు దూరంగా ఉంటున్నార‌ని… అస్స‌లు మాట్లాడుకోవడం లేదని ఎవరి సినిమా పనులలో వారు బిజీగా ఉంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.