నందమూరి నటసింహం బాలయ్య బర్త్ డే సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలువురు సెలబ్రిటీలు, సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. నందమూరి, తెలుగుదేశం అభిమానులు సోషల్ మీడియాలో బాలయ్యకు శుభాకాంక్షల వర్షం కురిపించేశారు. ఇక బాబాయ్ బర్త్ డే రోజు అబ్బాయ్ తారక్ విసెష్ చెప్పాలి కదా ? బాబాయ్‌కు అబ్బాయ్ బర్త్ డే విషెష్ ఎప్పుడూ ప్రత్యేకమే. ఒకవేళ ఫోన్లో చెప్పి ఉంటే అది వేరే విషయం.
అయితే సోషల్ మీడియాలో కనీసం ఒక్క ట్వీట్ అయినా వేయకపోవడంతో చాలా మందికి చాలా సందేహాలు కలుగుతున్నాయి. కనీసం అనిల్ రావిపూడి డైరక్షన్ లో తెరకెక్కుతోన్న భగవంత్ కేసరి టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. బాలయ్య అభిమానులు కాని వాళ్లు, ఇతర హీరోల అభిమానులు కూడా టీజర్ ర్యాంప్ ఆడేసిందని పొగుడుతున్నారు.
ఈ టైంలో ఎన్టీఆర్ కనీసం ఈ టీజర్ గురించి ఓ చిన్న ట్వీట్ వేసినా అది బాలయ్య అభిమానులకు, నందమూరి అభిమానులకు మాంచి జోష్ ఇచ్చేది. ఎన్టీఆర్ బాబాయ్ టీజర్ చూసి అదుర్స్.. బర్త్ డే శుభాకాంక్షలు అని పెట్టి ఉంటే బాగుండేది. పర్సనల్‌గా విష్ చేసినా అది పైకి ఎవ్వరికి తెలియదు.. దీంతో ఇప్పటికే బాబాయ్, అబ్బాయ్ మధ్య ఉన్న విబేధాలు ఇంకా అలాగే ఉన్నాయా ? అని చాలా మంది చర్చించు కుంటున్నారు.
ఏదేమైనా ఇప్పటికే ఎన్టీఆర్-బాలయ్య ఫ్యాన్స్ మధ్య కొంత గ్యాప్ వచ్చిందన్నది ఓపెన్ సీక్రెట్. కొందరు మాత్రం ఎన్టీఆర్, బాలయ్య ఇద్దరినీ అభిమానిస్తున్నారు. కొంత మంది ఇటు అటు డివైడ్ అయ్యారు. అయితే గతంలో ఎన్టీఆర్ బాలయ్యకు ట్వీట్టర్ ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ఇప్పుడు కూడా అదే పని చేసి ఉన్నట్లయితే పుకార్లకు తావు లేకుండా ఉండేది.