అల్లు అర్జున్‌కు హైద‌రాబాద్‌లో ఇన్ని బిజినెస్‌లు ఉన్నాయా… క‌ళ్లు చెదిరే సామ్రాజ్యం..!

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తనయుడిగా చిత్ర పరిశ్రమలో హీరోగా ఎంట్రీ వచ్చిన అల్లు అర్జున్ వ‌రుస‌ సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్ లోనే తనుకుంటూటూ ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకున్నాడు. అల్లు అర్జున్ కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా బిజినెస్ మాన్‌గా కూడా చాలా పాపులర్ అయ్యాడు. అల్లు అర్జున్ ప్రస్తుతం హైదరాబాదులో భారీ బిజినెస్‌లు చేస్తూ భారీగా సంపాదిస్తున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ వ్యాపారాల గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూద్దాం.

బఫెలో వైల్డ్ వింగ్స్:
అల్లు అర్జున్ అమెరికాకు చెందిన ప్రముఖ స్పోర్ట్స్ బార్ అండ్ రెస్టారెంట్ చైన్ అయిన ‘బఫెలో వైల్డ్ వింగ్స్స కు ఫ్రాంచైజీగా ఉన్నాడు. ఈ ఇది కూడా హైదరాబాద్ రోడ్ నెంబర్ 36 జూబ్లీహిల్స్ లో ఎంతో రద్దీగా ఉండే ఏరియా కూడా ఇదే. ఇక ఇది ఎంతోమంది ఆహార ప్రియులకు మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కూడా అందిస్తుంది.

ఆహా ఓటీటీ ప్లాట్‌ఫారమ్:
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో థియేటర్లకన్నా ఓటీటీ లోనే ఎక్కువ సినిమాలు చూడటానికి అందరూ ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే ఇంటర్నేషనల్ వైడిగా ఎంతో పాపులర్ అయిన అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ సంస్థలకు పోటీగా తొలి తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫారమ్ ఆహాను కూడా అల్లు అర్జున్, అల్లు అరవింద్ ప్రారంభించారు. ఇందులో తెలుగు సినిమాలు వెబ్ సిరీస్ లు కూడా ప్రచారణకు వస్తున్నాయి. రీజినల్ ఓటీటీ యాపుల్లో ఆహా నెంబర్ వన్ గా ఉంది. ఈ సంస్థకు అల్లు అర్జున్ కో ఫౌండర్.

అల్లు స్టూడియోస్:
ఈ అల్లు స్టూడియోస్ అనేది అల్లు అర్జున్ కి చెందిన ఎంతో అత్యాధునిక చిత్ర నిర్మాణ సంస్థ. ఇది కూడా హైదరాబాద్ రోడ్ నెంబర్ 10 జూబ్లీహిల్స్ లో ఉంది. ఇందులో సినిమా షూటింగ్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు అన్ని పనులు ఇక్కడే లభిస్తాయి. ఈ స్టూడియోను అల్లు అర్జున్ తన తాత దివంగత హాస్యనటుడు అల్లూరి రామలింగయ్య స్మారకథం మొదలుపెట్టారు.

ఏఏఏ సినిమాస్:
ఇక రీసెంట్ గానే అల్లు అర్జున్ హైదరాబాద్ అమీర్పేట్ లో ఏఏఏ సినిమాస్ అనే ఎంతో ఆత్యాధునిక మల్టీప్లెక్స్ ను మొదలుపెట్టారు. మొత్తంగా ఈ మల్టీప్లెక్స్ లో 5 స్క్రీన్లు ఉన్నాయి. మొదటి స్క్రీన్ 67 అడుగుల ఎత్తులో ఉంటుంది. దక్షిణాదిలో ఎల్‌ఈడీ స్క్రీన్‌ ఉన్న ఒకే ఒక్క థియేటర్‌ ఇదే కావడం గమనార్హం. ఈ విధంగా అల్లు అర్జున్ సినిమాలతో పాటు వ్యాపార రంగంలో కూడా తనదైన రీతిలో దూసుకుపోతున్నాడు