మెగాస్టార్ ముందు డ్యాన్స్ చేసే ఈ బుడ్డోడు ఎవరో గుర్తు పట్టారా… ఇప్పుడో పాన్ ఇండియా మాస్ హీరో..!

టాలీవుడ్‌లో డ్యాన్స్‌కి మెగాస్టార్ పెట్టింది పేరు. అప్పటి వరకు సాదాసీదా స్టెప్పులతో హీరోలు అలరించే వారు. అలాంటి పరిస్థితుల్లో చిరు డ్యాన్స్‌తో సెన్సేషన్‌గా మారారు. ముఖ్యంగా బ్రేక్ డ్యాన్స్‌తో ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్నారు. 60 ఏళ్లు దాటినా ఇప్పటికీ సినిమాల్లో కష్టమైన స్టెప్పులను చాలా సులువుగా వేస్తుంటారు.

అలాంటి మెగాస్టార్ ముందు ఓ చిన్నారి డ్యాన్స్ చేస్తున్న ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఆ బుడతడు ఎవరో కాదు. పాన్ ఇండియా స్టార్, ప్రేక్షకులు ముద్దుగా ఐకాన్ స్టార్ అని పిలుచుకునే అల్లు అర్జున్. గంగోత్రి సినిమా ద్వారా సినిమాల్లోకి ఆయన ప్రవేశించారు. ఆర్యతో ఎందరో ప్రేక్షకులను సంపాదించుకున్నారు. దేశముదురు సినిమాతో మాస్ హీరోగానూ సత్తా చాటారు.

ఇక గతేడాది విడుదలైన పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. పుష్ప సినిమాలో ఆయన పలికిన డైలాగులకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. రాజకీయ నేతలు, సెలబ్రెటీలు కూడా ఆయన డైలాగులకు ఫిదా అయిపోయారు. మెగాస్టార్ మేనల్లుడిగా సినిమాల్లోకి వచ్చిన బన్నీ అనతి కాలంలోనే ప్రత్యేక ఫ్యాన్ బేస్ సంపాదించాడు. ఆయన డ్యాన్స్‌‌కి ఎందరో ప్రేక్షకులు ఉన్నారు.

ఎలాంటి సినిమా అయినా ప్రేక్షకులను ఆకట్టుకునేలా చేయడం ఆయన స్పెషాలిటీ. అదే పుష్ప సినిమాకు బాగా ప్లస్ అయింది. స్టైలిష్ స్టార్ గా పేరొందిన ఆయన పుష్ప సినిమాలో ఊరమాస్ లుక్ లో కనిపించారు. డీగ్లామరైజ్ గా కనిపించినా ప్రేక్షకులకు ఆయన పాత్ర ఎంతగానో నచ్చేసింది. శ్రీవల్లి పాటలో ఆయన సాదాసీదా స్టెప్పులు వేసినా, దేశమంతటా ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయిపోయారు.

ప్రస్తుతం ఆయన పుష్ప 2 సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా శరవేగంగా తెరకెక్కుతోంది. దీనికి సంబంధించిన కొన్ని డైలాగులు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. బాలీవుడ్ ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చేసింది.

ఏ మాత్రం అంచనాలు లేకుండా విడుదల చేసినప్పటికీ, పుష్ప మొదటి పార్ట్ భారీ కలెక్షన్లు సాధించింది. ఇప్పటికే మలయాళ ఇండస్ట్రీలో అల్లు అర్జున్‌కి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ఈ తరుణంలో పుష్ప 2 రికార్డులు సృష్టించడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.