మెగాస్టార్ చిరంజీవి ప‌క్క‌న న‌టించిన ఈ హీరోయిన్‌ను గుర్తు ప‌ట్టారా… ప్రేమ పెళ్లితో సెటిల్‌…!

కొంత మంది హీరోయిన్ ల పేరు చెబితే కన్నా ఆ హీరోయిన్ ఏ సినిమాలో చేసింది, ఏ పాటలో కనిపించిందో చెబితే ఈజీగా గుర్తుపడతారు. ఇప్పుడు ఈ హీరోయిన్ పేరు చెబితే మీకు ఇలానే అనిపిస్తుంది. ఆశిమా భల్లా..ఈ పేరు చెప్పే కన్నా ఆమె సినిమాలు, పాటలు చెబితేనే మీకు తొందరగా గుర్తొస్తుంది చూడండి. తెలుగులో చేసింది మూడు సినిమాలే. అయినా ఆ సినిమాతోనే గుర్తింపు తెచ్చుకుంది ఆశిమా భల్లా.

 

ఆశిమా భల్లా డాడీ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటించింది. పట్టా పక్కింటి నాటు కోడి పెట్టనీ, పెడతా ఎంచక్కా ప్రేమ బువ్వనీ’అంటూ డాడీ సినిమాలో చిరంజీవి, సిమ్రాన్లకు పోటా పోటీగా స్టెప్పులు వేసింది. ఆ తరువాత నన్ను లాలించు సంగీతం నువ్వే కదా అంటూ ఒక పాటలో కూడా అద్భుతంగా చేసింది. ఈ సినిమాలో తొట్టెంపూడి వేణుతో కలిసి నటించింది. ఈ రెండు సినిమాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టాయి.

అయితే ఆ తరువాత కేవలం ఒక్క సినిమాలోనే కనిపించింది. తెలుగులోనే కాదు హిందీ, తమిళంలో కూడా సినిమాలు చేసింది. బుల్లితెరలో కూడా కనిపించి ఆ తరువాత సినిమాలకు గుడ్ బై చెప్పిసింది. ఆ తరువాత సన్నీ మీనన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుందని టాక్. వీరికి ఒక పాప కూడా ఉంది. అప్పట్లో ఆశిమా భల్లా మహేంద్ర కారు యాడ్‌లో కనిపించింది. అయితే అప్పటితో పోలిస్తే ఇప్పుడు మరింత అందంగా తయారయ్యింది ఆశిమా భల్లా.

సినిమాల్లో కనిపించకపోయినా హీరోయిన్ లుక్స్ తో అదరగొడుతుంది. ఇప్పుడు ఆ ఫోటోలు చూసి ఆమెకు పెళ్ళై 10 ఏళ్ళు దాటిందంటే అందరు షాక్ అవ్వాల్సిందే. ఆశిమా భల్లా సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియాలో యాక్టీవ్ గానే ఉంటుంది. లేటెస్ట్ ఫొటోస్ ని షేర్ చేస్తుంది. ఆ ఫొటోలో చూసిన వారంతా కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికి హీరోయిన్ లానే ఉన్నావ్ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.