పైలెట్ అవుతానని పాన్ ఇండియా హీరోయిన్ అయిన ఈ క్యూట్ బేబీని గుర్తు ప‌ట్టారా ?

ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరో హీరోయిన్ల ఫోటోస్ , వీడియోస్ త్రో బ్యాక్ థీంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలో క్యూట్‌గా కనిపిస్తున్న ఈ చిన్న పాప ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోయిన్. సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ పాప నెపోటిజం నుంచి డ్రెస్సింగ్ స్టైల్ వరకు అనేక రకాల ట్రోల్స్ ఎదుర్కొంటుంది. బాలీవుడ్ లో మొదటి సినిమాతో హీరోయిన్‌గా పరిచయమై తర్వాత టాలీవుడ్ లో కూడా అడుగుపెట్టి పాన్ ఇండియా హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది.

ఇంతకీ ఈ స్టార్ హీరోయిన్ ఎవరో ? గుర్తుపట్టారా.. హిందీ నటుడు చుంకి పాండే కూతురు అనన్య పాండే. ‘ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 ‘ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్న అనన్య తర్వాత పతి పత్నీ ఔర్ వో, ఆంగ్రేజి మీడియం, ఖాలీపీలీ, శకున్ బత్రా సినిమాలో నటించింది. తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో ‘ లైగ‌ర్ ‘ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

లైగ‌ర్‌ సినిమా పాన్ ఇండియా లెవ‌ల్‌లో రిలీజై డిజాస్టర్‌గా నిలిచింది. అయినా ఆమెకు ఛాన్సులు ఏ మాత్రం త‌గ్గ‌లేదు. ప్రస్తుతం ఆమె ఖో గయే హమ్ కహాన్, డ్రీమ్ గర్ల్ 2 సినిమాలలో నటిస్తుంది.
ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అందాల ఆర‌బోత‌లో ఏమాత్రం తగ్గకుండా కెమెరాలకు స్టిల్స్ ఇస్తూంది. ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ తన ఫాలోవర్స్ కి కంటిపై నిద్ర లేకుండా చేస్తుంది అనన్య‌.

ఇదే క్రమంలో అనన్య తాజాగా తన చిన్ననాటి వీడియోను షేర్ చేసింది. అందులో ఆమె సూటు బూటు వేసుకుని బ్లాక్ క్యాప్ తో క్యూట్ గా కనిపిస్తుంది. పెద్దయ్యాక ఏమవ్వాలి అనుకుంటున్నావు అని అడిగిన ప్రశ్నకు పైలెట్ అవుతా ? అంటూ ఆన్సర్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ పాన్ ఇండియా హీరోయిన్‌గా మారింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సో క్యూట్, క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్, బ్యూటిఫుల్‌ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజ‌న్స్. ఈ వీడియోకు ఇప్ప‌టికే చాలామంది బాలీవుడ్ హీరోలు స్పందించారు..

 

View this post on Instagram

 

A post shared by Ananya 💛💫 (@ananyapanday)