కళ్యాణ్ రామ్ భార్యకు ఆ స్టార్ హీరో అంటే అంత ఇష్టమా..? ఆయన కోసం అంతకు తెగించేసిందా..?

నందమూరి కుటుంబం నుంచి నటరత్న ఎన్టీఆర్ తర్వాత ఆయన వారసులుగా బాలకృష్ణ, హరికృష్ణ చిత్రపరిశ్రమలో అడుగుపెట్టారు. బాలకృష్ణ మాత్రం వరుస సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగాడు. హరికృష్ణ మాత్రం కొన్ని సినిమాలకే పరిమితం అయ్యాడు. వీరి తర్వాత మూడోతరం హీరోలుగా ఈ కుటుంబం నుంచి హరికృష్ణ కొడుకులు ఎన్టీఆర్- కళ్యాణ్ రామ్ చిత్ర పరిశ్రమలో హీరోలగా అడుగు పెట్టారు. వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా ఎదిగాడు.

Kalyan Ram క‌ళ్యాణ్‌రామ్ భార్య స్వాతికి బాల‌య్య భార్య వ‌సుంధ‌ర‌కు ఉన్న రిలేష‌న్ ఇదే..!

అలాగే ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ కూడా వైవిధ్యమైన సినిమాలు చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే హీరో గానే కాకుండా నిర్మాతగా కూడా తన సత్తా చాటుకున్నాడు.గత ఏడాది కళ్యాణ్ రామ్ నటించిన బింబిసారా సినిమాతో బంపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన అమీగోస్‌ సినిమాతో ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు.

ప్రస్తుతం డెవిల్ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇదే సమయంలో కళ్యాణ్ రామ్ వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే ఆయన వైఫ్ పేరు స్వాతి ఈమె గురించి పెద్దగా ఎవరికి తెలియదు. కళ్యాణ్ రామ్ స్వాతి లది పెద్దలు కుదిరిచిన వివాహం. తొలి పెళ్లి చూపుల్లోనే స్వాతి బాగా నచ్చడంతో కళ్యాణ్ రామ్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. స్వాతి కూడా ఎంతో గొప్ప కుటుంబం నుంచి వచ్చింది. వృత్తిరీత్యా ఈమె ఒక డాటర్. అయితే అదే సమయంలో నందమూరి ఇంటికి కోడలిగా వచ్చిన తర్వాత స్వాతి తన వృత్తిని వదిలిపెట్టి సంపూర్ణ గృహిణిగా మారింది. స్వాతి గురించి మ‌రొక ఇంట్రెస్టింగ్ విష‌యం ఏంటంటే.

Actor Nagarjuna Talks About Business and Movies - enRight Public Relations

మన తెలుగు చిత్ర పరిశ్రమలో తన భర్త కంటే సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున అంటేనే ఈమెకు ఎక్కువ ఇష్టమట. నాగార్జునకు స్వాతి ఎంతో వీరాభిమాని నాగార్జున నటించిన మన్మధుడు సినిమాని ఈమె ఎన్నిసార్లు చూసిందో ఆమెకే తెలియదు. అదే సమయంలో ఆమె చదువుకునే రోజులో నాగార్జున నటించిన సినిమా రిలీజ్ అవుతుందంటే కాలేజ్ డుమ్మా కొట్టి మరి సినిమాకి వెళ్లేదట. ఇలా ఆమె చదువుకునే రోజుల్లో ఎన్నోసార్లు నాగార్జున సినిమాకు కాలేజ్ గోడదూకి మరి వెళ్ళిందట.