అరుంధ‌తి” సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవ‌రో తెలుసా..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క కెరీర్ లో అరుంధతి సినిమాకు ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు సీనియర్ దర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతో ఘనవిజయం సాధించింది. ఈ సినిమాలో అనుష్క నటన చూసి ఫిదా అవ్వని ప్రేక్షకుడు లేడు.. భారీ బడ్జెట్ తో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా నిర్మాతలకు భారీ లాభాలే తెచ్చిపెట్టింది. అనుష్క కెరియర్ లోనే ఈ సినిమా మెమొరబుల్ సినిమాగా మిగిలిపోయింది.

Arundhati (2009 film) - Wikipedia

ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ షాకింగ్ నిజం ఒక‌టి వైరల్ గా మారింది. ఈ సినిమాలో అనుష్క క్యారెక్టర్ ను ముందుగా ఓ స్టార్ హీరోయిన్ వదులుకుందట. ఆ హీరోయిన్ ఎవరు.. అసలు కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా నిర్మాత శ్యామ్‌ప్రసాద్ రెడ్డి దర్శకుడు కోడి రామకృష్ణ తో కలిసి ఓ భారీ హారర్ జోనర్లో ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా చేయాలని భావించాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ రోల్‌ కోసం మమతా మోహన్ దాస్‌ను సంప్రదించారు.

South Indian star Mamta Mohandas reveals her battle with Vitiligo | South-indian – Gulf News

ముందుగా ఈ సినిమాకు ఓకే చేసిన మమత మోహన్ దాస్.. తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన యమదొంగ సినిమాలో అవకాశం రావడంతో ఆ సినిమాలో నటించడానికి వెళ్లిపోయింది. అదే సమయంలో మమతా మోహన్ దాస్‌కు కొంతమందిది చెప్పిన మాటలను విని అరుంధతి సినిమాకు నో చెప్పింది. ఇక ప్రొడ్యూసర్ శ్యామ్‌ప్రసాద్ రెడ్డి ఆమె కోసం మూడు నెలల ఎదురుచూసినా ఆమె నో చెప్పటంతో త‌ర్వాత‌ ఈ సినిమాను అనుష్కతో తీసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు శ్యామ్‌ ప్రసాద్ రెడ్డి. ఇక ప‌క్క వారి మ‌ట‌లు విన‌డం వ‌ల‌న మమతా మోహన్ దాస్ పెద్ద త‌ప్పు చేశాన‌ని ఎంత‌గానో బాధ‌ప‌డింద‌ట‌.

Yamadonga - Wikipedia