విలక్షణ దర్శకుడు తేజ డైరక్షన్‌లో వచ్చిన జయం సినిమాతో నితిన్ హీరోగా టాలీవుడ్‌లో ఎంట్రి ఇచ్చిడు. ఇక తన మొదటి సినిమాతోనే సూపర్ హిట్‌ను తన ఖాతలో వేసుకున్నాడు నితిన్. 2002లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా హీరో నితిన్, హీరోయిన్ సదాతో పాటు ఎంతోమంది కమెడియన్ల కెరీర్ లను మలుపు తిప్పిన సంగతి తెలిసిందే.కేవలం కోటీ 80 లక్షల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా సినిమాకు భారీగా కలెక్షన్లు వచ్చాయి.
ఈ సినిమాను కేవలం 65 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసి అప్పట్లో ఓ ట్రెండ్ క్రియేట్ చేశాడు. అయితే దర్శకుడు తేజ ఈ సినిమాతో ముందుగా అల్లు అర్జున్‌ను తెలుగులో హీరోగా పరిచయం చేయాలని ప్రయత్నించాడు. ఆ సమయానికి బన్నీ తెలుగులో హీరోగా ఎంట్రీ ఇవ్వలేదు. అదే సమయంలో తేజ ఇదే స్టోరీని అల్లు అరవింద్ ఎందుకు చెప్పగా అదే సమయానికి అల్లు అరవింద్ తన కొడుకు డబ్యూ మూవీ కోసం దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు తో చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు.
ఆ తరువాత డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి కొడుకైన నితిన్ అడిషన్స్ లో అద్భుతంగా చేసి హీరోగా సెలెక్ట్ అయ్యాడు. ఇక ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ కోసం ముందుగా దర్శకుడు తేజ ఓ బాలీవుడ్ స్టార్ హీరోని ఎంపిక చేయగా అతని యాక్టింగ్ నచ్చకపోవడంతో.. ఆ తర్వాత తెలుగు స్టార్ హీరో గోపీచంద్ కు ఈ విలన్ రోల్‌లో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమాకు ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించగా ఆ పాటల సినిమాకి ఎంతో ప్లస్ గా మారాయి.ఈ విధంగా జయం మూవీని అల్లు అర్జున్ వదులుకోవాల్సి వచ్చింది. ఈ సినిమాకి అల్లు అర్జున్ ఓకే చెప్పుంటే మాత్రం తన డెబ్యూ సినిమా ఇదే అయ్యిండేది.