చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోలు ఉన్న.. హీరోయిన్లు ఉన్న..అంతమందిలో ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరు ఎంతో బాగా నచ్చుతూ ఉంటారు. అలా ఇండస్ట్రీలో ఉండే హీరోలకి కూడా వారి టేస్ట్ కి తగ్గట్టు హీరోయిన్లు ఇష్టపడుతూ ఉంటారు. అయితే చాలామంది ఇండస్ట్రీలో ఉండే పెద్దలకి ప్రముఖులకీ అందరికీ ఇష్టమైన దర్శకుడు ఎవరంటే ఎస్ఎస్ రాజమౌళి . ఇక ఆయనకు ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలిస్తే అందరూ కచ్చితంగా ఆశ్చర్యపోతారు అందరూ అనుకోవచ్చు . ఇంత పెద్ద గ్లోబల్ దర్శకుడికి ఏ హాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్ అంటే ఇష్టం ఉంటుందని..
కానీ రాజమౌళి టేస్టే సపరేట్.. ఆయన దర్శకత్వంలో వచ్చే సినిమాలు చూస్తే మనకు అర్థమయిపోతుంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాజమౌళి తనకి ఇష్టమైన హీరోయిన్ ఎవరు అనేది బయట పెట్టాడు. ఆ ఇంటర్వ్యూలో ముందుగా తనకు మహానటి సావిత్రి అంటే ఇష్టమని, ఆ తర్వాత సౌందర్య గారిని ఎంతో ఇష్టపడ్డారట. ప్రస్తుత కాలంలో ఇష్టమైన హీరోయిన్ ఎవరు అన్నదానికి రాజమౌళి తనకు నిత్య మీనన్ అంటూ చెప్పుకు వచ్చాడు.
అంతేకాకుండా ఆమె ఎంతో న్యాచురల్ గా నటిస్తుంది అంటూ కూడా చెప్పుకొచ్చారు. అయితే ఆమెతో సినిమాలు చేసే ఆలోచన లేదు అంటూ కూడా క్లారిటీ ఇచ్చేశాడు. దానికి రీజన్ ఆమె పొట్టిగా ఉంటుంది అందుకే మిగతా హీరోలకి సూట్ అవ్వదు. నేను ఎంచుకునే కథలకు హీరోలకి పెద్దగా బాడీ హీరోయిన్లు కూడా వారికి తగ్గట్టు ఉండాలి. అలా చూసుకుంటే నా డైరెక్షన్లో జీవితాంతం నిత్య మీనన్ సినిమా చేయలేదు.. నా డైరెక్షన్ లో ఆమె సినిమా చేయకపోయినా ఆమె నటనని ఇష్టపడుతూనే ఉంటాను అంటూ రాజమౌళి చెప్పుకొచ్చారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో మారింది.