మన టాలీవుడ్ లో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోలలో చిరంజీవి ముందు వరుసలో ఉంటే.. ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ ఉంటాడు. అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ ని మొదలుపెట్టి, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలో నటించాడు. చిరంజీవి, నాగార్జున, జగపతిబాబు, హరికృష్ణ వంటి హీరోల సినిమాలలో చిన్న చిన్న పాత్రలో నటించాడు.. కనీసం అతన్ని గుర్తుంచుకునే పాత్రలు కూడా ఆ రోజుల్లో రవితేజకు దక్కలేదు.
ఇక ఆ తర్వాత కృష్ణవంశీ తెరకెక్కించిన ” సింధూరం ” అనే సినిమాతో తొలిసారిగా రవితేజ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఈ సినిమాలో తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. తర్వాత “నీకోసం” అనే సినిమాతో తొలిసారిగా సోలో హీరోగా నటించాడు. మళ్లీ చిరంజీవి హీరోగా వచ్చిన ” అన్నయ్య” సినిమాలో ఆయనకు తమ్ముడుగా నటించి మంచి పేరు దక్కించుకున్నాడు.
ఆదే సమయంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఫుల్ బిజీగా ఉన్న రవితేజ ఖాళీ లేక కొన్ని సినిమాలను వదులుకోవాల్సి వచ్చింది. అదే సమయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు తొలి సినిమా రాజకుమారుడులో మంచి పాత్రను మిస్ చేసుకున్నాడట. ఆ తర్వాత రవితేజ హీరో అయి స్టార్ స్టేటస్ ను దక్కించుకున్న తర్వాత మళ్లీ మహేష్- రవితేజ కాంబోలో సినిమా సెట్ కాలేదు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. అయ్యో ఇంత మంచి కాంబినేషన్ మిస్ అయిందా అని బాధపడుతున్నారు. రాబోయే రోజులోనైనా ఈ ఇద్దరు హీరోలు కలిసి నటిస్తారో లేదో చూడాలి..?