మహేష్ – పాయల్ కాంబోలో రావాల్సిన ఆ సూపర్ హిట్ సినిమా ఏంటో తెలుసా..? బ్రతికిపోయాడు మన హీరో..!!

కొన్ని సినిమాలు హీరో, హీరోయిన్లను ఓవర్ నైట్ లోనే వారికి భారీ క్రేజ్ తెచ్చి పెడుతూ ఉంటాయి.. అలా ఆర్ఎక్స్ 100 సినిమాతో భారీ క్రేజ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మ పాయల్‌ రాజ్‌పుత్‌.. మొదటి సినిమాతోనే తన నటనతో తన గ్లామర్ షో తో ప్రేక్షకులను తన మాయలో పడేసుకుంది ఈ ముద్దుగుమ్మ. తొలి సినిమా తోనే భారీ క్రేజ్‌ తెచ్చుకున్న పాయల్ కు తర్వాత తెలుగులో అవకాశాలు అనుకున్నంత స్థాయిలో రాలేదని చెప్పాలి.

టాలీవుడ్ లో అవకాశాలు రాకపోయినా ఈ ముద్దుగుమ్మ పంజాబీ సినిమాల్లో మాత్రం ఎంతో బిజీ అయిపోయింది. ఈ ఢిల్లీ భామ ప్రస్తుతం మంగళవారం సినిమాతో ప్రేక్షకులు ముందుకురాబోతుంది. పాయల్ కు మొదటి సినిమాతోనే భారీ హిట్ ఇచ్చిన దర్శకుడు అజయ్ భూపతి తోనే ఈ మంగళవారం సినిమా చేసింది. రీసెంట్ గానే విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాయల్‌ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.

అసలు మ్యాటర్ ఏమిటంటే మహేష్ బాబుతో నటించాలని తన డ్రీమ్ అని.. గతంలో మహేష్ కు జంటగా సర్కారు వారి పాట సినిమాలో ఛాన్స్ కోసం చాలా ట్రై చేసానని కూడా పాయల్ చెప్పుకొచ్చింది. అయితే ఆ అవకాశం కీర్తి సురేష్ కు వచ్చింది. కీర్తి కూడా ఆ సినిమాలో తన నటనతో బాగా మెప్పించింది అయితే తనకు మాత్రం మహేష్ పక్కన నటించే ఛాన్స్ మిస్ అయిందని ఆమె చెప్పుకొచ్చింది. ఎప్పటికైనా మహేష్‌కు జంటగా నటించే అవకాశం వస్తే మాత్రం తప్పకుండా ఆ సినిమా చేస్తానని అదే తన డ్రీమ్ అని పాయల్‌ చెప్పకు వచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ అన్న మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.