బాలయ్య ‘ లెజెండ్ ‘ మూవీలో నటించిన ఆ చిన్నారికి బోయ‌పాటి ఏమ‌వుతాడో తెలుసా…!

టాలీవుడ్ లోనే వ‌రుస‌ విజయాలతో దూసుకుపోతున్న హీరోలలో నట‌సింహం నందమూరి బాలకృష్ణ కూడా ఒకరు.. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఎంతో బిజీగా కొనసాగుతున్నాడు. బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో సినిమా అంటే ప్రేక్షకులకు ఎంతో క్రేజ్ ఉంటుంది. బాలకృష్ణ- బోయపాటి కాంబోలో వచ్చిన తొలి సినిమా సింహ. ఈ సినిమా దగ్గరనుంచి బాలకృష్ణకు మళ్ళీ టాలీవుడ్ లో విజయాలు మొదలయ్యాయి.

2014 ఎలక్షన్ ముందు వీరి కాంబోలో వచ్చిన రెండో సినిమా లెజెండ్. ఇది కూడా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ రికార్డు క్రియేట్ చేసి1000 రోజులకు పైగా థియేటర్ల‌లో ఆడింది. ముచ్చటగా వీరీ కాంబోలో వచ్చిన మూడో సినిమా అఖండ. ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. బోయపాటికి ముందు బాలయ్యకు వరుసగా బ్యాక్ టు బ్యాక్ విజయాలు ఇచ్చిన దర్శకుడు బి గోపాల్ కూడా ఒక‌రు.

బాలయ్య- బి గోపాల్ కాంబినేషన్లు వచ్చిన నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచాయి. బోయపాటి సినిమాలు కూడా అలాగే సూపర్ హిట్ కొట్టాయి. ఇదే సమయంలో బాలయ్య – బోయపాటి కాంబోలో వచ్చిన రెండో సినిమా లెజెండ్.. ఈ సినిమాలో నట‌సింహం తన నట విశ్వరూపాన్ని చూపించాడు. అంతేకాకుండా ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ లో నటించి మెప్పించాడు. రాధిక ఆప్టే, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు.

Watch Legend Telugu Movie on Amazon Prime | Legend Telugu Movie

ఈ సినిమాలో బాలకృష్ణ తన చెల్లిని చూడడానికి వెళ్లిన సన్నివేశంలో బాలయ్య నటన ఆయన డైలాగులు ప్రేక్షకులు చేత విజిల్స్ కొట్టించాయి. ఆడపిల్లల గురించి ఆ సీన్లు బాలయ్య చెప్పి ఒక్కో డైలాగ్ ఎంతో హైలెట్‌గా నిలిచింది. ఇక అదే సమయంలో ఈ సినిమాలో బాల‌య్య‌ను మామయ్య అంటూ ఎంతో ముద్దుగా పిలిచిన‌ చిన్నారి మీకు గుర్తుండే ఉంటుంది.. ఆ చిన్నారి ఎవరో మీకు తెలుసా..? ఆ పాప మరెవరో కాదు దర్శకుడు బోయపాటి శ్రీను కూతురు జోషిత శ్రీను. అయితే ఇప్పటివరకు కూడా ఆ పాప దర్శకుడు బోయపాటి శ్రీను కూతురు అని చాలామందికి తెలియదు.

ఈ సన్నివేశంలో బోయపాటి కూతురు కూడా తన క్యూట్ పెర్ఫార్మన్స్ తో ప్రేక్షకులను మెప్పించింది. మరీ ముఖ్యంగా జోషిత మావయ్య అని పిలవగానే బాలయ్య మురిసిపోవడం ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుందనే చెప్పాలి. ఈ సినిమాలో విలన్ గా నటించిన‌ జగపతిబాబు పాత్ర కూడా సినిమాకే హైలెట్ గా నిలిచింది. అన్నీ కలిసి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ సెన్సేషన్ క్రియేట్ చేసింది.