మన తెలుగు చిత్ర పరిశ్రమలో డాన్స్ తప్ప అన్ని రంగాలలో మంచి పట్టు ఉన్న ఏకైక హీరో ఎవరు అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పాలి. ఆయన నటించే ప్రతి సినిమాలో అన్ని విభాగాల్లో తన మార్క్ నటన ఉండేలా చూసుకుంటాడు. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే పవన్ కళ్యాణ్ దర్శకత్వం వహించిన ఏకైక సినిమా ఏదైనా అంటే జానీ అని అందరూ అనుకుంటారు.
కానీ ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే తమ్ముడు మరియు ఖుషి సినిమాలకు కూడా ఆయన దర్శకుడుగా వ్యవహరించారు. ఇదే విషయాన్ని స్వయంగా పవన్ ప్రాణ స్నేహితుడు డైరెక్టర్ ఆనంద సాయి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ నటించిన గుడుంబా శంకర్ సినిమాకి ఆయన స్క్రీన్ ప్లే అందించిన విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాను వీర శంకర్ అనే దర్శకుడు తెరకెక్కించాడు.
అయితే కేవలం స్రీన్ నేమ్ మాత్రమే వీర శంకర్ . కానీ దర్శకత్వం మొత్తం పవన్ కళ్యాణ్ చేతుల మీదనే జరిగింది. అంతేకాకుండా ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన మణిశర్మ తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. “నేను ఇప్పటివరకు చేసిన సినిమాల్లో నా కెరీర్‌లోనే బెస్ట్ ఆల్బం ఏదైనా ఉందా అంటే అది గుడుంబా శంకర్ అనే చెబుతాను.. ఈ ఒక్క సినిమాలో ఇన్ని రకాల జానర్స్ ని నేను ఇప్పటివరకు ఏ సినిమాలో కూడా వాడలేదు.
ఇదంతా పవన్ కళ్యాణ్ దగ్గరుండి నాతో చేయించుకున్నాడు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ సినిమాకి సంగీత దర్శకుడుగా కూడా ఆయనే వ్యవహరించారు.నేను, రాత్రి పగులు తేడా లేకుండా ఆయన నా రికార్డింగ్ రూమ్ లోనే ఉండేవాడు, ప్రతీ చిన్న విషయని అడిగి తెలుసుకొని తన ఇష్టానికి తగ్గట్టుగా మ్యూజిక్ ని కంపోజ్ చేయించుకున్నాడు. అందుకే ఈ సినిమాకి సంగీత దర్శకుడి క్రెడిట్ ఆయనకే ఇస్తాను అంటూ మణిశర్మ అప్పట్లో చేసిన కామెంట్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి..!!
ఇక పవన్ కళ్యాణ్ గొప్ప నటుడు దర్శకుడే కాకుండా మంచి గాయకుడు కూడా ఇప్పటివరకు ఆయన నటించిన ఎన్నో సినిమాల్లో కూడా పాటలు కూడా పాడారు. ఇప్పుడు తాజాగా నటించబోయే సినిమాల్లో కూడా పవన్ తన గాత్ర దానం చేయబోతున్నాడు.ఇలా పవన్ కళ్యాణ్ అన్ని రంగాల్లో తన మార్కును చూపిస్తూ దూసుకుపోతున్నాడు.