ఏడుపదుల వయసులో కూడా మన సీనియర్ స్టార్ హీరోలు ఏదో ఒక సినిమాలో నటించి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సీనియర్ ఎన్టీఆర్ కంటే ముందే చిత్ర పరిశ్రమంలో అడుగుపెట్టి స్టార్ హీరోగా ఏదైనా అక్కినేని నాగేశ్వరరావు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పవచ్చు. 60 ఏళ్లు దాటిన తర్వాత ఎన్టీఆర్ ఏఎన్ఆర్ హీరోలుగా పలు సినిమాలు చేసిన.. నాగేశ్వరరావు మాత్రం ఇప్పుడు ఎలాంటి పాత్ర వచ్చిన నటించాలని ఉద్దేశంతో ముందుగానే తన వయసుకు సరిపడా పాత్రల కోసం చూసేవారు. వారి తర్వాత తరం హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ స్టార్ హీరోలుగా మారిన తర్వాత ఎన్టీఆర్- ఏఎన్నార్ కూడా వారి సినిమాల్లో గెస్ట్ రోల్ చేసిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి.
ఇదే సమయంలో 1993లో మోహన్ బాబు నిర్మాతగా హీరోగా, రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన మేజర్ చంద్రకాంత్ సినిమాలో ఎన్టీఆర్ టైటిల్ రోల్ లో నటించారు. ఆ సినిమా విడుదలై బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక మరో సీనియర్ హీరో సూపర్ స్టార్ కృష్ణ తమ్మారెడ్డి భరద్వాజ దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ, ఆమని జంటగా నటించిన ‘పచ్చని సంసారం’ కూడా హిట్ అయ్యింది. ఇక సోగ్గాడు శోభన్ బాబు హీరోగా ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఏవండీ ఆవిడ వచ్చింది’ సినిమా కూడా అదే ఏడాది రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది.
ఇక రెబల్ స్టార్ కృష్ణంరాజు , సుమన్ తో కలిసి శరత్ దర్శకత్వంలో వచ్చిన ‘బావా బావమరిది’ సైతం బ్లాక్ బస్టర్ అయ్యింది.నిజానికి ఈ సినిమాల పై అంచనాలు అంతంత మాత్రమే. కానీ అదే సంవత్సరం చిరంజీవి- అక్కినేని నాగేశ్వరరావు కలిసి నటించిన మెకానిక్ అల్లుడు విడుదలకు ముందు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు- చిరంజీవితో పాటు ముఖ్యమైన పాత్రలో నటించాడు. అంతేకాకుండా ఈ సినిమాలో చిరంజీవితో పాటు నాగేశ్వరరావు గురువా గురువా అనే పాటలో మెగాస్టార్ కి పోటీగా డాన్స్ చేశారు.
చిరు కు జంటగా లేడీస్ సూపర్ స్టార్ విజయశాంతి హీరోయిన్గా నటించింది. బి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 1997 మే 27న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ డిజాస్టర్ గా మిగిలింది.
ఈ సినిమాతో ఏఎన్నార్ ఒక్కసారిగా విమర్శల పాలయ్యారు. ఆ తర్వాత నాగేశ్వరరావు ఇతర హీరోలతో సినిమాలు చేయడం మానేశారు.