మన తెలుగువారి ఆత్మగౌరవానికి నిలువుటద్దంగా నిలిచిన ఎన్టీఆర్. ఆయన గురించి తెలియని వారు ఉండరు. ఎన్టీఆర్ సినీ జీవితంలో ఎన్నో సినిమాల్లో నటించి ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నారు. ఇక మన తెలుగు చిత్ర పరిశ్రమ ప్రస్తుతం ఈ స్థాయిలో ఉందంటే దానికి ముఖ్య కారణం ఎన్టీఆర్. అలాంటి గొప్పవ్యక్తి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అదే సమయంలో ఎన్టీఆర్ తర్వాత ఆయన నట వారసుడుగా చిత్ర పరిశ్రమలోకి వచ్చిన బాలయ్య కూడా తండ్రికి తగ్గ నటుడుగా టాలీవుడ్ లోనే అగ్ర హీరోగా కొనసాగుతున్నాడు.
అలాంటి బాలయ్య తన కెరీర్ ప్రారంభంలో తండ్రి ఎన్టీఆర్ తో కలిసి 12 సినిమాల్లో నటించారు. అందులో ఏడు సినిమాలు ఎన్టీఆర్ డైరెక్షన్లో వచ్చినవే. అదే సమయంలో బాలయ్య తన తండ్రి చెప్పిన మాటలు ఎప్పుడూ ధిక్కరించే వారు కాదు. ఆయన ఏమి చెప్పినా బాలయ్య తూచా తప్పకుండా ఫాలో అయ్యేవాడు. ఎన్టీఆర్ తో కలిసి నటించేటప్పుడు షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ సెట్లోకి వచ్చారంటే బాలయ్య సైలెంట్ అయిపోయాడు.
అదే సమయంలో ఎన్టీఆర్ – బాలకృష్ణ కాంబోలో వచ్చిన ఓ సినిమాకు బాలయ్య డైరెక్షన్ చేశాడనే విషయం చాలామందికి తెలియదు. ఎన్టీఆర్ తన డైరెక్షన్లో ఎన్నో గొప్ప సినిమాలను తెరకెక్కించాడు. వాటిలో సామ్రాట్ అశోక కూడా ఒకటి. అయితే ఈ సినిమాకు దర్శకత్వ బాధ్యతలు మాత్రం బాలకృష్ణ చేశాడనే విషయం చాలా మందికిి తెలియదు.
ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎన్టీఆర్, బాలకృష్ణ కు దర్శకత్వ బాధ్యతలు అప్పజెప్పి ఈ సినిమాను అతి తక్కువ కాలంలో పూర్తి చేయాలనే షరతు కూడా పెట్టాడట. బాలయ్య డైరెక్షన్ బాధ్యతలు తీసుకున్న తర్వాత షూటింగ్ వేగం తగ్గిందట. ఎన్టీఆర్, తర్వాత బాలకృష్ణను తప్పించి తానే స్వయంగా ఈ సినిమాను తక్కువ రోజుల్లో పూర్తి చేశాడు. బాలయ్య ఈ సినిమాలో కొన్ని సీన్లలో తన తండ్రిని డైరెక్ట్ చేశాడు.
అయితే ఈ సినిమా అంచనాలు అందుకోలేదు. బాలయ్య ఓ సినిమాకు డైరెక్ట్ చేయాలన్న కోరిక తీరలేదు. దీంతో తన స్వీయదర్శకత్వలో నర్తనశాల సినిమా మొదలు పెట్టారు. అయితే ఆ సినిమాలో ద్రౌపది పాత్రలో నటిస్తోన్న సౌందర్య హఠాన్మరణంతో అది కూడా మధ్యలోనే ఆగిపోయింది.