సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడుగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన మహేష్ బాబు తండ్రికి తగ్గ తనయుడుగా క్రేజ్ సంపాదించుకున్నాడు. క్లాస్, మాస్ తేడా లేకుండా అన్ని జానర్ సినిమాల్లో నేచురల్ గా నటిస్తూ ఎన్నో హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలోనే మహేష్ తన కెరీర్ లో ఎన్నో సినిమాలను రిజెక్ట్ చేసాడు. కథ నచ్చినా మహేష్ బాబు ఒక సినిమాను రిజెక్ట్ చేశాడట. అసలు విషయానికి వస్తే మహేష్ బాబు బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే కాంబినేషన్లో ఒక సినిమా చూడాల్సి ఉన్నా మనం ఆ ఛాన్స్ మిస్ అయ్యాం.
ఫీల్ గుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల మహేష్ – దీపిక కాంబినేషన్లో ఒక సినిమాను తెరకెక్కించాలనుకున్నారట. ఆ సినిమా కథను మహేష్ బాబుకు వినిపించాడట. మహేష్ బాబుకు ఈ సినిమా కథ నచ్చినా సినిమాను రిజెక్ట్ చేశాడట. అలాగే దీపిక పదుకొనే కూడా సినిమాను ఏదో కారణంతో రిజెక్ట్ చేయడం జరిగింది. ఆ సినిమా ఏదో కాదు ఫిదా. ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సినిమాల లిస్టులో ఫిదా సినిమా కూడా ఒకటి.
శేఖర్ కమ్ముల ఈ సినిమాను మహేష్ బాబు తో తెరకెక్కించాలనుకున్నాడు. దీపిక పదుకొనేను ఈ సినిమాకు హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నాడట. అయితే ఫిదా సినిమా కథను శేఖర్ కమ్ముల మహేష్ బాబుకు వినిపించగా ఆయనకు ఆ పాత్ర బాగా నచ్చింది. ఒక స్టార్ హీరో కు తగ్గ రేంజ్ లో ఆ సినిమా కథ లేదనే కారణంతో సినిమా సక్సెస్ కాదేమోనన్న అనుమానంతో మహేష్ బాబు ఈ సినిమాను రిజెక్ట్ చేయాల్సి వచ్చింది.
అలా ఈ సినిమా వరుణ్ తేజ్ దగ్గరకు వెళ్ళింది. అయితే ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటించింది. సాయి పల్లకి ఇది మొదటి సినిమా అయినా తన నటనతో, డాన్స్ తో అందరినీ మెప్పించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో శేఖర్ కమ్ములతో పాటు వరుణ్ తేజ్ – సాయి పల్లవి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.