టాలీవుడ్లో ఉన్న స్టార్ హీరోలు ప్రస్తుతం వాళ్లు చేసిన ఒక్కో సినిమాకి కొన్ని కోట్ల రూపాయలను రెమ్యూనరేషన్ గా అందుకుంటున్నారు. స్టార్ హీరోల అభిమానుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. ప్రతి అభిమాని కూడా తమకి ఇష్టమైన హీరోల గురించి తెలుసుకోవడానికి ఎంతో ఆత్రుతగా చూస్తూ ఉంటారు. అయితే మన స్టార్ హీరోలు వారి నటించిన మొదటి సినిమాకి అందుకున్న రెమ్యూనరేషన్ ఎంతో ఒకసారి చూద్దాం.
ముందుగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో నటించిన తొలి సినిమాకి రూ.1116 రెమ్యూనరేషన్ అందుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడూ తన ప్రతి సినిమాకి రూ.50 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకు అంటున్నాడు చిరంజీవి. మరో స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా బాల నటుడుగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి ఆ తర్వాత హీరోగా నటించిన తొలి సినిమా రాజకుమారుడుకుగాను రూ.10 లక్షల రెమ్యూనరేషన్ అందుకున్నాడట.
పాన్ ఇండియా హీరో ప్రభాస్ తొలిసారిగా నటించిన ఈశ్వర్ సినిమాకు ఐదు లక్షల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నాడు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తన తొలి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాకు గాను ఐదు లక్షల రెమ్యూనరేషన్ అందుకున్నట్లు తెలుస్తుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఆయనని నటించిన తొలి మూవీ నిన్ను చూడాలని సినిమాకు గాను నాలుగు లక్షల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నాడు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన తొలి సినిమా చేసినందుకు కేవలం వంద రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్నాడట. ప్రస్తుతం రూ.80 కోట్లకు పైనే రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు. ఇక మరో హీరో విజయ్ దేవరకొండ సినిమాల్లోకి రాకముందు ట్యూషన్లు చెప్పేవాడు. అందుకుగాను మొదట విజయ్ దేవరకొండ తీసుకున్న పారితోషికం 500 రూపాయలు. అయితే ఆయన నటించిన మొదటి సినిమా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, నువ్విలా వంటి సినిమాలలో అసలు రెమ్యూనరేషన్ తీసుకోలేదు.