టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు సిచువేషన్ డిమాండ్ చేస్తే ఎటువంటి పాత్రలో నటించడాకైనా అంగీకరిస్తున్నారు. అయితే చాలామంది స్టార్ హీరో హీరోయిన్స్ గా గుర్తింపు తెచ్చుకుని నటీనటులు కూడా కొన్ని సినిమాల్లో భార్యా, భర్తలుగా నటించి తర్వాత అన్న, చెల్లెలుగా నటించిన వారు కూడా ఉన్నారు.
ముందు నటించిన సినిమాల్లో భార్యా, భర్తలుగా చూసిన కపుల్స్ తర్వాత వచ్చిన సినిమాలో అన్నా, చెల్లెలుగా కనిపించడంతో ప్రేక్షకులు ఆ కాంబినేషన్ తీసుకోలేక ఫ్లాప్ గా నిలిచిన సినిమాలు కూడా ఉన్నాయి. అయితే రీల్ కపుల్స్ గా రొమాంటిక్ సినిమాల్లో నటించిన హీరో, హీరోయిన్ లు అన్నా, చెల్లెలుగా నటించిన సినిమాలు ఏంటో ఆ హీరో, హీరోయిన్ లు ఎవరో ఒకసారి తెలుసుకుందాం.
నయనతార – చిరంజీవి :
సైరా నరసింహారెడ్డి సినిమాలో భార్యా , భర్తలుగా నటించిన చిరు, నయన్ తర్వాత వచ్చిన గాడ్ ఫాదర్ సినిమాలో అన్నా, చెల్లెలుగా కనిపించారు. అయితే ఈ జంటపై ట్రోల్స్ జరగడంతో పాటు సినిమా కూడా అంతగా సక్సెస్ కాకపోవడానికి ఇది ఒక కారణంగా కూడా నిలిచింది.
రమ్యకృష్ణ – నాజర్ :
రజనీకాంత్ హీరోగా నటించిన నరసింహ సినిమాలో రమ్యకృష్ణ, నాజర్ అన్న, చెల్లెలుగా నటించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమాలో వీరిద్దరూ భార్యాభర్తలుగా నటించారు.
ప్రకాష్ రాజ్ – జయసుధ :
చాలా సినిమాల్లో భార్యాభర్తలుగా నటించిన ప్రకాష్ రాజ్, జయసుధ సోలో సినిమాలో అక్క, తమ్ముడు గా నటించారు. అయితే ఈ సినిమా అంతగా సక్సెస్ కాలేదు అప్పటివరకు భార్యా, భర్తలుగా కనిపించి పర్ఫెక్ట్ పెయిర్ అనిపించుకున్న ఈ జంట ఒకసారిగా అక్క తమ్ముడిగా కనిపించడంతో ఈ సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి పోయింది.
కృష్ణ – సౌందర్య :
సూపర్ స్టార్ కృష్ణ , సౌందర్య ఎన్నో సినిమాల్లో హీరో హీరోయిన్ లు గా భార్యా , భర్తల రోల్ ను పోషించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే రవన్న సినిమాలో ఈ జంట అన్న, చెల్లెలు పాత్రను పోషించడంతో ప్రేక్షకులు ఈ సినిమాను ఇష్టపడలేదు. దీంతో ఈ సినిమా కూడా అంతగా సక్సెస్ కాలేదని చెప్పాలి.
ఎన్టీఆర్ – సావిత్రి :
ఒకప్పుడు టాలీవుడ్ లో తిరుగులేని కాంబినేషన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ జంట ఎన్నో సినిమాల్లో హీరో హీరోయిన్ లు గా భార్య, భర్తలుగా కనిపించారు. అయితే రక్తసంబంధం అనే సినిమా ద్వారా అన్నా, చెల్లెల పాత్రలో ఈ జంట నటించడంతో ప్రేక్షకులు ఈ సినిమాకు కనెక్ట్ అవ్వలేకపోయారు. దీంతో ఈ సినిమా అంతగా సక్సెస్ కాలేదు.