సీనియర్ హీరోయిన్ రాధిక మూడు పెళ్లిళ్లు తెలుసా… ఆమె ముగ్గురు భ‌ర్త‌లూ సెల‌బ్రిటీలే ?

ఒకప్పటి టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ రాధిక గురించి తెలిసిందే. ఈమె తెలుగులో ఉన్న అందరు స్టార్ హీరోలతో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగులోనే కాకుండా కోలీవుడ్ లో కూడా రాధిక ఎన్నో సినిమాలు నటించి అక్కడ కూడా స్టార్ హీరోయిన్‌గా మారింది. ఇదే సమయంలో రాధిక సినీ కెరీర్ ఎంత సక్సెస్‌పుల్‌గా సాగిన ఈమె వ్యక్తిగత జీవితం మాత్రం ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉండేది. దానికి ప్రధాన కారణం రాధిక మూడు పెళ్లిళ్లు చేసుకోవడం. రాధిక మూడు పెళ్లిళ్లు చేసుకోవడం వెన‌క చాలా బాధ దాగి ఉంది.

ఇక రాధిక 1984లో ప్రముఖ మ‌ళ‌యాళ‌ దర్శక నిర్మాత అయిన ప్రతాప్ ను వివాహం చేసుకుంది. అతడితో పెళ్లయిన రెండు సంవత్సరాలకే టార్చ‌ర్ త‌ట్టుకోలేక రాధిక ప్రతాప్ నుంచి విడాకులు తీసుకుంది. ప్రతాప్, రాధికతో విడాకులు తర్వాత ఆమె గురించి నెగిటివ్గా పబ్లిసిటీ చేశాడు. అయితే రాధిక తన మొదటి భర్త గురించి ఇప్పుడు ఒకసారి కూడా మాట్లాడలేదు. తర్వాత కొన్ని సంవత్సరాలు ఒంటరిగా ఉన్న రాధిక బ్రిట‌న్ దేశ‌స్తుడు రిచ‌ర్డ్ ను రెండో వివాహం చేసుకుంది. అయితే వీరి బంధం కూడా ఎక్కువ కాలం ఉండలేకపోయింది.

రాధిక, రిచ‌ర్డ్ ను పెళ్లి చేసుకోవడం తన జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు అని ఆవేదన కూడా వ్యక్తం చేసింది. అయితే అప్పటికే రాధిక కు రిచ‌ర్డ్ తో ఒక కూతురు కూడా జన్మించింది. ఇక ఆ కూతురు పేరు రేయాన్. రెండో భ‌ర్త‌తో కూడా విడిపోయాక రాధిక‌ తన కూతురు రేయానేక‌ సర్వసంగా భావించి బ్రతికింది. అంతేకాకుండా అదే సమయంలో ఆమె ఆస్తులన్నింటినీ కోల్పోవాల్సి వచ్చింది.

రాధిక జీవితంలో జరిగిన సంఘటన కారణంగా ఆమెకు సినిమా అవకాశాలు కూడా ఇవ్వటానికి ఎవరూ దగ్గరికి వచ్చేవారు కాదు. అదే సమయంలో రాధిక బుల్లితెరపై సీరియల్స్ లో అడుగుపెట్టి మళ్లీ తన స్టార్ స్టేటస్ దక్కించుకుంది. ఇక 1995 సంవ‌త్స‌రంలో ప్రేమ‌కావాలి సినిమా షూటింగ్ స‌మ‌యంలో హీరో శ‌ర‌త్ కుమార్, రాధిక‌ను పెళ్లి చేసుకుంటావా ? అని ప్ర‌పోజ్ చేశాడ‌ట‌.

అప్ప‌టికే త‌న‌కు పెళ్లి వ‌ల్ల జ‌రిగిన అనుభ‌వాల‌తో ఈ సారి నిర్ణ‌యం త‌న పేరెంట్స్ కు వ‌దిలేసింద‌ట‌. కానీ పేరెంట్స్ కు న‌చ్చ‌డంతో వారు రాధిక‌ను ఒప్పించి శ‌ర‌త్ కుమార్ తో వివాహం జ‌రిపించారు. అప్ప‌టికే శ‌ర‌త్‌కుమార్‌కు త‌న మొద‌టి భార్య‌తో విడాకులు అయిపోయాయి. ఈ విధంగా రాధిక తన జీవితంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. చివరకు తన మూడో భర్త శరత్ కుమార్ తో ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది.