నందమూరి నట సార్వభౌమ ఎన్టీఆర్ ఈ పేరుకు తెలుగు రాష్ట్రాలో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కొన్ని వందల సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ రాజకీయాల్లోనూ అడుగుపెట్టి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మంచి పేరు సంపాదించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్టీఆర్ పేద ప్రజలకు ఎంతగానో సేవచేశారు.
కోట్లాదిమంది ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఎన్టీఆర్‌ని తెలుగువారు చాలామంది దేవుడిలా కొలుస్తుంటారు. ఎన్టీఆర్ పర్సనల్ జీవితంలో చాలా ఆసక్తికర విషయాలు ఉంటాయి. ఎన్టీఆర్ – బసవతారకంను పెళ్లి చేసుకున్న తర్వాత 8 మంది కొడుకులకు, 4 కూతుర్లకు జన్మనిచ్చాడు. ఎన్టీఆర్ కి హిందూ ధర్మం అన్నా, ఆచార సాంప్రదాయాలు, తెలుగు భాష అన్నా ఎంతో గౌరవం.
ఎన్టీఆర్ తన కొడుకులు, కూతుర్లు, మనవరాలకు పెట్టిన పేర్లు చూస్తే తెలుగుపై ఉన్న జ్ఞానం ఎన్టీఆర్ కళాత్మక హృదయం అర్థమవుతాయి. వారందరి పేర్లను కూడా చివరన ప్రాస కుదిరే విధంగా ఎన్టీఆర్ పెట్టారు. 7గురు కుమారుల పేర్లను చివరగా కృష్ణ అని వచ్చే విధంగా పెట్టారు ఎన్టీఆర్. హరికృష్ణ, రామకృష్ణ, సాయి కృష్ణ, జయ కృష్ణ, బాలకృష్ణ ఇలా అందరి పేర్లు కృష్ణ అని వస్తుంది.
కూతుర్ల విషయానికి వస్తే నలుగురు కూతుళ్ళ పేర్లు చివర ఈశ్వరి అని వచ్చేలా నామకరణ చేశారు.
లోకేశ్వరి, పురందేశ్వరి, ఉమామహేశ్వరి, భువనేశ్వరి అని పేరుచివర ఈశ్వరి వచ్చేలా నామకరణం చేశారు. ఆ తర్వాత తరంలో కూడా ఎన్టీఆర్ పెట్టిన పేర్లు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఎన్టీఆర్ తన పెద్ద కొడుకు జయకృష్ణ కుమార్తె పేరు కుదిమిని, రెండో కొడుకుకి ఇద్దరు కూతుర్లు కాగా వారిద్దరి పేర్లు శ్రీమంతుని, మనస్విని అని పెట్టారు.
బాలకృష్ణ ఇద్దరు కూతుళ్ళ పేర్లు బ్రాహ్మణి, తేజస్విణి గా నామకరణం చేశారు. ఎన్టీఆర్ చిన్న కుమారుడు సాయి కృష్ణ కుమార్తె పేరు ఈశాని అని ఇలా పేర్లు వింటేనే ఎన్టీఆర్ ఎంత క్రియేటివ్ గా ఆలోచించారో తెలుస్తోంది. ఇలా ప్రాస కలిసే విధంగా ఇంతవరకు ఎవరు కూడా ఇన్ని పేర్లను పెట్టి ఉండరు. ఎన్టీఆర్ ఏది చేసినా ప్రత్యేకంగా ఉంటుంది అనడానికి ఇది ఒక నిదర్శనం.