టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో ఇప్పటికే అతడు, ఖలేజా వంటి సినిమాలు వచ్చాయి. ఇక ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా గుంటూరు కారం రాబోతుంది. ఈ సినిమాను కూడా వచ్చే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సమయంలోనే ఈ సినిమాపై గత కొన్ని రోజులుగా ఎన్నో వార్తలు వైరల్ గా మారుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి ముందుగా అనుకున్న హీరోయిన్ పూజ హెగ్డేను తప్పించారు. అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా ఈ మూవీ నుంచి తప్పించినట్టు వార్తలు కూడా వచ్చాయి.
ఈ సినిమాలో మహేష్‌కు జంటగా శ్రీ లీల, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఈ విషయం పక్కనపడితే షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే నిజానికి గుంటూరు కారం కంటే ముందే మహేష్- త్రివిక్రమ్ కాంబోలో ఓ బ్లాక్ బస్టర్ మూవీ మిస్సయింది. అలా మిస్సయిన సినిమా మరేదో కాదు అ ఆ.
త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో నితిన్- సమంత జంటగా నటించారు. అనుపమ పరమేశ్వరనన్ సెకండ్ హీరోయిన్‌గా చేసింది. నదియా ,నరేష్, రావు రమేష్, హరితేజ వంటి నటులు కీలకపాత్రలో నటించారు. ఈ సినిమాని కూడా త్రివిక్రమ్ హోం బ్యానర్ హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్ వారే నిర్మించారు. అవుట్ ఆండ్ అవుట్ ఫ్యామిలీ లవ్ ఎంటర్టైర్నర్ గా 2016లో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.
అయితే నిజానికి ఈ సినిమాని మొదట త్రివిక్రమ్, మహేష్ తో చేయాలనుకున్నాడట. ఈ సినిమా కథను కూడా మహేష్ కు చెప్పక ఆయనకు నచ్చినప్పటికీ.. తన ఇమేజ్‌కు సూట్ అవుదని మహేష్ అ ఆ సినిమాని రిజెక్ట్ చేశాడట. ఆ తర్వాత ఈ సినిమా కథలోకి నితిన్ వచ్చాడు.. కట్ చేస్తే సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.