పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. ఈ బ్యూటీ కి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోయినా అది తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా గొప్ప పేరు ప్రఖ్యాతలను సంపాదించుకుంది. అరుంధతి సినిమాతో జేజమ్మగా పాపులర్ అయ్యింది. ఆమె అభిమానులు ఇప్పటికీ ఆ పేరుతోనే పిలుస్తూ ఉంటారు. తెలుగులోనే కాదు. తమిళ్ లో కూడా హిట్ సినిమాల్లో నటించింది. స్టార్ హిరోలతో సమానంగా అభిమానులను సంపాదించుకుంది.
ఇకపోతే ఇండస్ట్రీలో ఎటువంటి వివాదాల్లో తల దూర్చని హీరోయిన్లలో అనుష్క కూడా ఒకటి… ఈమె ఫ్యామిలీ గురించి అతి తక్కువ మందికీ మత్రమే తెలుసు. తాజాగా అనుష్క తన తల్లి ప్రేమను పొగుడుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ వైరల్ అవ్వడంతో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక నిన్నతన తల్లి పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేసింది. ఆమె తల్లి ప్రపుల్ల శెట్టి పుట్టినరోజును అనుష్క శెట్టి ఘనంగా జరిపింది.
ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా తమ ఫోటోనే పోస్ట్ చేసింది. అమ్మను పొగుడుతూ అందమైన నోట్ రాసింది. తన తల్లి తనను ఎలా చూసిందో.. అనే విషయాన్ని అభిమానులతో పంచుకుంది. ఆ పోస్ట్ పై ఆమె అభిమానులు రకరకాల కామెంట్స్ చేశారు. మొత్తానికి ఆ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదే సమయంలో అనుష్క సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్ గా ఉండదు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసేందుకు అంతగా ఆసక్తి చూపదు.
అయితే సోషల్ మీడియాలో తన తల్లితో కలిసి దిగిన ఫోటోలని ఆమె పుట్టినరోజున పోస్ట్ చేసింది. అంతేకాదు అద్భుతమైన పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ అంటూ రాసుకోచ్చింది. ఇక దీంతో మరోసారి సోషల్ మీడియలో వైరల్‌గా మారింది. ఈ ముద్దుగుమ్మ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం అనుష్క ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ‘ సినిమాతో బిజీగా ఉంది.
ఈ మూవీలో యంగ్ హీరో నవిన్ పోలిశెట్టికి జంటగా నటిస్తుంది. వచ్చేనెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా అనుష్క వెండి ధరపై కనిపించి చాలా కాలం అవ్వడంతో.. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి కోసం ఆమె అభిమానులు ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా మరో ప్రాజెక్టు కూడా ఓకే చెప్పిందని టాక్.
happu birthday maaa🥳😘😇🤗 pic.twitter.com/r0SjnwNfCt
— Anushka Shetty (@MsAnushkaShetty) July 31, 2023