మ‌హాభార‌తం + స్టార్‌వార్స్ = క‌ల్కి 2898 AD .. ఇంకెన్ని ట్విస్టులంటే..!

వెండితెరపై యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి అవతారం ఎత్తాడు. ప్రభాస్, కమలహాసన్, అమితాబచ్చన్, దీపికా పదుకొనే, దిశాపటాని లాంటి అగ్రతారాలు నటిస్తున్న ప్రాజె క్టుకే సైన్స్ ఫిక్షన్ సినిమా టైటిల్ ఎట్ట‌కేలకు రిలీజ్ అయింది. వైజయంతి మూవీస్ విన్నర్ పై అశ్వినీద‌త్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కల్కి 2898 AD అనే టైటిల్ మేకర్స్ ఖరారు చేసినప్పటి నుంచి ఈ సినిమాపై సోషల్ మీడియాలో ఒక్కసారిగా చర్చలు స్టార్ట్ అయ్యాయి.

ఇంకా చెప్పాలి అంటే ప్రభాస్ బాహుబలి, సలార్ రేంజ్ లో ఈ సినిమాకు హైప్ వచ్చేసింది. అసలు గ్లింప్స్‌ వీడియో చూస్తున్న జనాలు మెస్మరైజ్ అవుతున్నారు. ప్రపంచాన్ని చీకటి కమ్మేసినప్పుడు ఒక శక్తి ఉద్భవిస్తుంది.. అప్పుడు అంతం ఆరంభం అవుతుంది అన్నట్టుగా ఈ వీడియోలో చూపించారు. ఈ వేడుకలో కమల్ మాట్లాడుతూ మేము స్టోరీలు చేస్తుంటే ఆడియన్స్ మమ్మలని స్టార్లు చేస్తున్నారు.. కల్కిలో పెద్ద విజన్ ఉంది.. ఈ సినిమాలో తాను భాగం కావడం గౌరవంగా ఉందన్నారు.

నాగ్‌ అశ్విన్ తన క్యారెక్టర్ ను డిజైన్ చేసిన తీరు బాగా నచ్చిందని.. ఈ సినిమాలో స్ట్రాంగ్ ఎమోషన్లు ఉన్నాయని.. ఈ సినిమా నాకు అద్భుతం.. దీని వెనక గొప్ప పరిశోధన ఉందని అమితాబచ్చన్ తెలిపారు. నాగ్ అశ్విన్ మాట్లాడుతూ మహాభారతం + స్టార్ వార్స్ రెండిటిని చూస్తూ, వింటూ పెరిగాను ఈ రెండు ప్రపంచాలను క‌లిపి ఒక గొప్ప సినిమా చేయాలనుకున్నప్పుడు క‌ల్కి 2898 AD పుట్టిందని తెలిపారు.

ఇక నిర్మాత అశ్వినీద‌త్‌ మాట్లాడుతూ ఈ సినిమా మాకు గర్వకారణం అని స్పష్టం చేశారు. ఏదేమైనా ఓ మ‌హాభార‌తం రేంజ్‌, ఓ స్టార్‌వార్స్ రేంజ్‌లో మ‌నం క‌ల్కి సినిమాను చూడ‌బోతున్నాం అన్న‌ది అయితే క్లారిటీ వ‌చ్చేసింది.