టాలీవుడ్లో స్టార్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు మారుతి. ఎన్నో హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన మారుతికి ఒక కూతురు హియా దాసరి ఉంది. ఇటీవల ఆమె దిగిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అవి చూసిన చాలామంది ఇప్పటినుంచే ఇంత హాట్ గా కనిపిస్తున్నావు యువర్ సో బ్యూటిఫుల్.. నీ అందం ముందు హీరోయిన్లు కూడా పనికిరారు అంటు కామెంట్స్ చేస్తున్నారు. ఇక హియా దాసరికి అందంతోపాటు మరు ప్రత్యేకమైన టాలెంట్ కూడా ఉందట.
హియా దాసరి మంచి ఆర్టిస్ట్. ఆమె గీసిన చిత్రాలు తాజాగా బంజారాహిల్స్ లోని పార్క్ హయత్ హోటల్లో డిస్ప్లే చేశారు. ఈ ఈవెంట్ లో ముఖ్య అతిథిగా అల్లు అరవింద్ పాల్గొన్నారు. ఆమె గీసిన చిత్రాలను చూసిన అరవింద్ ఆమె టాలెంట్ అభినందించాడు. ప్రస్తుతం జూనియర్ ఇంటర్ చదువుతున్న హియా దాసరి కామిక్ స్టోరీస్ లోని జోకర్, బ్యాట్ మెన్ తదితర క్యారెక్టర్ లను థీమ్స్ గా తీసుకొని బ్లాక్ అండ్ వైట్ మోడల్లో ఆర్ట్ షో చేసింది.
ఈ ఈవెంట్లో హియా మాట్లాడుతూ నేను 71 చిత్రాలు గీశాను.. ఇందుకు నాకు 8 నెలల టైం పట్టింది. నా ప్రతిభ వెనకాల నా తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎప్పుడూ ఉంది అంటూ వివరించింది. భవిష్యత్తులో మరిన్ని అంశాలపై నా చిత్రాలు ఉంటాయని హియా చెప్పుకొచ్చింది. ఇక ఈ కార్యక్రమంలో ఎంతో మంది ప్రముఖ సెలబ్రిటీస్ పాల్గొన్నారు.
సంగీత దర్శకులు ఎస్ఎస్ తమన్, నిర్మాత ఎస్ కే ఎన్, టీజే విశ్వప్రసాద్, ప్రొడ్యూసర్ రవిశంకర్, ప్రొడ్యూసర్ బన్నీ వాసు, నాగవంశీ, హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవి, విరాజ్ అశ్విన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వెంట్లో పాల్గొని ఆమె టాలెంట్ చూసి సెలబ్రిటీస్ అంతా ఫిదా అవుతున్నారు. హియాని ప్రసంసించారు.