క‌ల్కి 2898 AD డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ న‌టించిన తెలుగు సూప‌ర్‌హిట్ సినిమా తెలుసా..!

ప్రస్తుతం మన టాలీవుడ్ లో ఎంతో క్రేజీ ప్రాజెక్టుగా వస్తున్న సినిమాల్లో ప్ర‌భ‌స్ ‘కల్కి 2898 AD కూడా ఒకటి. పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ఎన్నో అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా వచ్చిన టీజర్ తో సినిమాపై అంచనాలు మరో లెవల్ కు పెరిగాయి. ప్రభాస్ నటించిన గత సినిమాలు ప్రేక్షకులను బాగా నిరాశపరచడంతో.. ప్రభాస్ అభిమానులు స‌లార్‌ సినిమాతో పాటు ఈ సినిమా పైనే భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఇప్పుడు ఈ సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రభాస్ అభిమానుల అంచనాలను మించేలా తన వర్క్ ను చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ తో నాగ్ అశ్విన్ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ చెప్పేసాడు. బాహుబలి సినిమాల‌తో తెలుగు సినిమాను పాన్ ఇండియా లెవెల్ కు తీసుకువెళ్లిన ఘనత ప్రభాస్‌కు దక్కింది. ఇప్పుడు ‘కల్కి 2898 AD సినిమాతో తెలుగు సినిమాలు హాలీవుడ్ సినిమాల స్థాయికి దర్శకుడు నాగ్ అశ్విన్ తీసుకువెళ్తున్నాడు. దీంతో దర్శకుడు నాగ్‌ అశ్విన్ పేరు కూడా సోషల్ మీడియాలో మార్మోగిపోతుంది.

అయితే గతంలో నాగ్‌ అశ్విన్ కూడా ఓ సినిమాలో నటించాడు అంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే నాగ్‌ అశ్విన్ తెలుగులో ఓ సినిమాలో నటించారని తెలుస్తుంది అది కూడా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో నాగ్ అశ్విన్ కూడా ఓ చిన్న పాత్రలో కనిపిస్తాడు అది కూడా మరో యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి కి ఫ్రెండ్ గా ఆ సినిమాలో నాగ్‌ అశ్విన్ కనిపిస్తాడు. ఇక ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో మరోసారి నాగ్‌ అశ్విన్ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారింది.