టాలీవుడ్ లో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోలతో సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించిన వర్మ ఇప్పుడు షార్ట్ ఫిలిం కంటే ఘోరంగా దిగజారిపోయి మరి సినిమాలు తీస్తున్నాడు. ఒకప్పుడు వర్మ అంటే బాలీవుడ్ మొత్తం షేక్ అయిపోయేది. అక్కడ స్టార్ హీరోలకే సూపర్ హిట్లు ఇవ్వడంతో పాటు సరికొత్త ఫిల్మ్ మేకింగ్‌ను బాలీవుడ్‌కు అలవాటు చేశాడు.
అయితే గత కొన్నేళ్లలో వర్మ మరీ నీచంగా దిగజారిపోయి ప్రవర్తిస్తున్నాడు. అసలు సోషల్ మీడియా అనేది లేకపోతే వర్మను జనాలు ఎప్పుడో మర్చిపోయి ఉండేవాళ్లు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు కాంట్రవర్సీ కామెంట్లు చేసుకుంటూ వార్తల్లో ఉండేందుకు ఇష్టపడే వర్మ తాజాగా వ్యూహం అనే సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇది ఏపీలో ముఖ్యమంత్రి జగన్ కు అనుకూలంగా.. ప్రతిపక్ష టిడిపి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా ఉంటుందన్న విమర్శలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
ఇది ఇలా ఉంటే మరో సీనియర్ దర్శకుడు గీతాకృష్ణ రాంగోపాల్ వర్మపై తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి ప్రస్తావించి వర్మ చాలా తప్పు చేశారని.. వర్మ ఏమైనా పెద్ద పత్తిత్తా ? అని ప్రశ్నించారు. వర్మ బూతు ఫోటోలతో డెన్ ఏర్పాటు చేశాడని.. అదో పెద్ద బ్రోత… హౌస్ అని ఘాటుగా గీతా కృష్ణ విమర్శలు చేశారు. వాడు ప్రతిరోజు అన్నం లేకపోయినా ఉంటాడేమో గాని.. సె…* లేకపోతే అస్సలు ఉండలేడని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటికే పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో రామ్ గోపాల్ వర్మను టార్గెట్ గా చేసుకుని తీవ్ర విమర్శలు చేస్తూ ఘాటైన పదజాలంతో విరుచుకుపడుతున్నారు. ఇక ఇప్పుడు గీతాకృష్ణ కూడా రాంగోపాల్ వర్మ బిహేవియర్ పై తీవ్ర విమర్శలు చేయడంతో పాటు వర్మను పచ్చి బూతు మనిషిగా అభివర్ణించటం.. ఆ వీడియోను జనసేన అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేయటం జరుగుతుంది.