టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయమక్కర్లేదు. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్ ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు. అయితే ప్రస్తుతం శ్రీకాంత్ హీరోగా కాకుండా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన సెకండ్ ఇన్నింగ్స్ ని కొనసాగిస్తున్నాడు. ఈ విషయం ఇలా ఉంచితే ఆయన భార్య ఊహ కూడా ఒకప్పటి స్టార్ హీరోయిన్ అన్న విషయం అందరికీ తెలిసిందే. కొన్ని సంవత్సరాల పాటు టాలీవుడ్ ను ఏలిన ఈమె ఎవరి బంధువు తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు.
ఇక ఈమె ఎవరు బంధువు కాదు.. ప్రముఖు టాలీవుడ్ సీనియర్ నటుడు పి ఎల్ నారాయణ కి ఈమె స్వయానా మేనకోడలు.. ఇక ఈమె అసలు పేరు శివరంజని, తమిళ సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వకముందే తమిళంలో 20 సినిమాలకు పైగా హీరోయిన్గా నటించి ఆ తర్వాత టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఆమె సినిమాతో తెలుగులో ఎంట్రీ వచ్చింది.
ఈ సినిమా తర్వాత ఈమెకు ఊహగా పేరు మార్చారు ఈ వివి సత్యనారాయణ.. తెలుగులో హీరో శ్రీకాంత్ తోనే ఎక్కువగా నటించగా.. అదే సమయంలో వారి మధ్య ప్రేమ చిగురించి తర్వాత పెద్దలు సమక్షంలో వివాహంతో ఒక్కటయ్యారు. వీరికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైన ఆమె కుటుంబ బాధ్యతల్లో మునిగిపోయారు. ఇక వీరి కుమారుడు రోషన్ హీరోగా రాణించే ప్రయత్నాల్లో ఉన్నాడు