ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ముద్దుగుమ్మ రష్మిక మందన్న. తన తొలి సినిమాతోనే బంపర్ హిట్ కొట్టడంతో తెలుగులో ఒక్కసారిగా రష్మిక పేరు మార్మోగింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన గీత గోవిందం సినిమాతో అదిరిపోయే ఇండస్ట్రీ హిట్ అందుకుంది. ఈ సినిమాతో రష్మిక , విజయ్ దేవరకొండ క్రేజ్ ఒక్కసారిగా అమాంతం పెరిగింది. ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా సెట్ అవ్వటంతో ఆ సినిమా దగ్గర నుంచి వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందన్న పుకార్లు ఎప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి.
ఈ సినిమా తర్వాత కూడా ఇద్దరూ డియర్ కామ్రేడ్ సినిమాలో కలిసి నటించారు. ఆ తర్వాత వీరి కాంబోలో మరో సినిమా రాలేదు. అయినా విజయ్ దేవరకొండ- రష్మిక లవ్ లో ఉన్నారనే వార్తలు ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి. రష్మిక మాత్రం టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలందరితో కలిసి నటిస్తూనే ఉంది. ఇదే సమయంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ తెచ్చుకుంది.
ఇదే సమయంలో రష్మిక నటించిన వరుస సినిమాలు బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అయినా సరే రష్మికకు బాలీవుడ్ లో వరుస అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే రౌడీహీరో విజయ్ దేవరకొండతో డేటింగ్ చేస్తోందన్న వార్తల నేపథ్యంలో నెటిజన్లు విజయ్- రష్మికలో ఏ క్వాలిటీ చూసి పడిపోయాడ్రా ? అని చర్చించుకుంటున్నారు. రష్మిక తాను తినే ఆహారాన్ని కూడా తానే ప్రిపేర్ చేసుకొని తినడానికి ఎంతో ఇష్టపడుతుందట.
అంతేకాకుండా కుకింగ్ అంటే రష్మికు ఎంతో ఇష్టమట. సినిమాల షూటింగ్ సమయంలో కూడా ఖాళీ సమయం దొరికితే మాత్రం కుకింగ్ చేయడానికి ఇష్టపడుతుందట. ఇక తన ఇంట్లో కూడా తన పుడ్ తానే ప్రిపేర్ చేసుకుని తింటుందట. ఈ క్వాలిటీతో పాటు ఆమెలో కష్టపడే తత్వం, జాలీగుణం చూసే విజయ్ దేవరకొండ రష్మికకు పడిపోయాడంటూ మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.