ఆ హీరోయిన్‌ ప్ర‌భాస్‌కు అంత పెద్ద దెబ్బ వేసిందా… ఎవ్వ‌రికి తెలియ‌ని సీక్రెట్ ఇది..!

రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసునిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ ప్రస్తుతం దేశవిదేశాల్లో హాలీవుడ్ హీరోల స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకుని కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తున్నారు. అయితే స్టార్ హీరో ప్రభాస్ కెరీర్ తొలినాళ్లలో వరుస ఫ్లాపులతో ఇబ్బందులు పడిన సందర్భాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈశ్వర్ సినిమాతో కెరీర్ ను మొదలుపెట్టిన ప్రభాస్ కు తొలి ప్రయత్నంలో యావరేజ్ హిట్ దక్కింది.

Prabhas Has Much Bigger Plans For His Earnings Apart From Just Charging 100  Crore+ Per Film?

ప్రభాస్ రెండో సినిమా రాఘవేంద్ర డిజాస్టర్ గా నిలిచి ప్రభాస్ కు షాక్ ఇచ్చింది. అయితే వర్షం సినిమాతో తొలి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న ప్రభాస్ కు అదే ఏడాది విడుదలైన అడవి రాముడు సినిమాతో షాక్ తగిలింది. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా ఆర్తి అగర్వాల్ నటించారు. బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేదు. అయితే ఈ సినిమా ఆర్తి అగర్వాల్ వల్లే ఫ్లాపైందని చాలామంది నమ్ముతారు.

ఈ సినిమా షూట్ సమయానికి ఆర్తి అగర్వాల్ షేపులు మారిపోవడంతో సినిమాలో ఆర్తి అగర్వాల్ బొద్దుగా కనిపించారు. దర్శకనిర్మాతలకు సైతం ఈ విషయం తెలిసినా షూట్ కు చాలారోజుల ముందే ఆమెను ఫిక్స్ చేయడం వల్ల షూటింగ్ సమయానికి ఆమె లుక్స్ మారిపోవడంతో ఏం చేయలేకపోయారు. ఆర్తి అగర్వాల్ వల్లే కథ, కథనం బాగున్నా అడవిరాముడు సినిమా మ్యాజిక్ ను రిపీట్ చేయడంలో ఫెయిలైంది.

Aarthi Agarwal - Photo 44 of 48

అడవిరాముడు మూవీ కూడా హిట్టై ఉండి ఉంటే ఆ సినిమాతో ప్రభాస్ క్రేజ్ మరింత పెరిగి ఉండేది. ఈ సినిమా ఫ్లాప్ కావడం వల్ల నిర్మాతకు నష్టాలు వచ్చాయని అప్పట్లో కామెంట్లు వినిపించాయి. ప్రభాస్ కు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా సరైన కథలను ఎంచుకోలేకపోవడం ప్రభాస్ కు కొన్నిసార్లు మైనస్ అవుతోంది. బాహుబలి2 సినిమా తర్వాత వరుస ఫ్లాపులు ప్రభాస్ కు భారీ షాకిచ్చాయి.

కథల ఎంపికలో ప్రభాస్ మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం అయితే ఉందని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలపైనే ప్రభాస్ ఆశలు పెట్టకోగా ఈ సినిమాలు ప్రభాస్ నమ్మకాన్ని నిజం చేస్తాయేమో చూడాలి. ప్రభాస్ ను నమ్మి నిర్మాతలు నిర్మిస్తున్న భవిష్యత్తు ప్రాజెక్ట్ ల బడ్జెట్ ఏకంగా రూ.4000 కోట్ల రూపాయలు అని సమాచారం. ప్రభాస్ సినిమాలతో ఇండియన్ సినీ ఇండస్ట్రీలో కొత్త రికార్డులు క్రియేట్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Watch Adavi Ramudu 2004 on ott streaming online