మెగాస్టార్ చిరంజీవి అంటేనే చిత్ర పరిశ్రమకు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా టాలీవుడ్ లో అడుగుపెట్టి టాప్ హీరోల్లో ఒకడిగా ఎదిగాడు. ఎవరు ఊహించిన ప్రత్యేక ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్నాడు. ఇప్పటివరకు ఆయన కేరీర్లో 150 కు పైగా సినిమాలు నటించారు. ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో బోళా శంకర్ అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాను కోలీవుడ్లో సూపర్ హిట్ అయిన వేదాళంకు రీమేక్ గా తెలుగులో తెరకెక్కుతుంది. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాని ఆగస్టు లేదా దసరా కానుకగా ప్రేక్షకుల ముందు రానుంది.
ఇక ఇప్పుడు ఈ విషయం పక్కన పెడితే చిరంజీవి అగ్ర హీరోగా మారడం వెనక సూపర్ స్టార్ కృష్ణ అందించిన సహాయం కూడా ఉందన్న విషయం చాలా మందికి తెలియదు..? మీరు వెంటుంది నిజమే చిరంజీవి కోసం కృష్ణ కెరియర్ లో ఎవరికీ చేయని ఓ గొప్ప సహాయం చేశాడు. ఇంతకీ చిరుకి కృష్ణ చేసిన సాయం ఏంటంటే.. చిరంజీవి కెరీర్ లోనే మైల్ స్టోన్ గా నిలిచిన చిత్రం ఖైదీ. ఏ కోదండ రామారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మాధవి హీరోయిన్గా నటించింది. 1983లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్గా నిలిచి చిరంజీవికి స్టార్డమ్ తెచ్చిపెట్టింది. ఖైదీ సినిమా తర్వాత చిరంజీవి మళ్ళీ వెనకి తిరిగి చూసుకోలేదు వరుస విజయాలతో దూసుకుపోయాడు.
ఇదే సమయంలో ఖైదీ సినిమాని మొదట కోదండరామిరెడ్డి సూపర్ స్టార్ కృష్ణతో చేయాలని భావించారు. అయితే కృష్ణకు కథ బాగా నచ్చినప్పటికీ ఖైదీ చిరంజీవితో చేయమని చెప్పారట. ఆ రోజుల్లో కృష్ణ చిరంజీవి మధ్య మంచి స్నేహం సంబంధం ఉండేది. చిరంజీవి అప్పుడే అప్ కమింగ్ హీరో. ఆ సమయంలోనే కృష్ణ చిరంజీవితో కలిసి తోడుదొంగలు సినిమా కూడా చేశాడు. ఈ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా దగ్గర్నుంచి కృష్ణ- చిరంజీవి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది.
ఆ సాన్నిహిత్యంతోనే కృష్ణ ఖైదీ సినిమాను చిరంజీవి కోసం త్యాగం చేశారట. ఆ తర్వాత ఖైదీ సినిమా చిరంజీవి హీరోగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తర్వాత మళ్ళీ పసివాడి ప్రాణం సినిమాను కూడా ముందుగా కృష్ణతో తీయాలని అనుకున్నారు అది కూడా ఆయన నో చెప్పడంతో మళ్లీ చిరంజీవి హీరోగా ఈ సినిమా వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది. అంతేకాకుండా చిరంజీవి గతంలో సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్గా కూడా చేశారట.ఇలా చిరంజీవికి కృష్ణ ఎంతో సహయం చేశారు. ఇక కృష్ణ లేకపోతే చిరు లేడు అనే చెప్పలి.