మన తెలుగు చిత్ర పరిశ్రమ అగ్ర నటులలో సూపర్ స్టార్ కృష్ణ కూడా ఒకరు. అయిన తన జీవితంలో ఏది చేసినా డేరింగ్ అండ్ డాషింగ్ గానే చేసుకుంటూ వెళ్లారు. తన సినీ కెరీర్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలో నటించి మెప్పించారు. కృష్ణ గారికి – ఇందిరా దేవికి ఐదుగురు సంతానం. అందులో పద్మావతి పెద్ద కుమార్తె, తర్వాత రమేష్ బాబు, మంజుల, మహేష్ బాబు చివరగా ప్రియదర్శిని. ఇక కృష్ణ పెద్ద కుమార్తె పద్మావతి వివాహం 1991 జూన్ 26న చెన్నైలో గల్లా జయదేవ్‌తో ఎంతో ఘనంగా జరిగింది.
గల్లా జయదేవ్ మరెవరో కాదు గల్లా అరుణకుమారి, రామచంద్ర రావుల ఏకైక కుమారుడు. ప్రస్తుతం గుంటూరు ఎంపీ. అయితే అప్పట్లో ఎంతో సింపుల్ గా అచ్చు వేయించిన వీరి పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ పెళ్లి పత్రికను చూస్తుంటే ఎంతో సింపుల్‌గా కనిపిస్తున్నా వీరి పెళ్లి మాత్రం ఎంతో ఘనంగా చేశారట. చెన్నైలో అప్పట్లో ఈ పెళ్లి గురించి ఎంతో గొప్పగా చెప్పుకున్నారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎందరో రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన అగ్ర ప్రముఖులు ఈ పెళ్లికి ఎందరో హాజరయ్యారు.
అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కూడా కృష్ణ ఈ పెళ్లికి ఆహ్వానించారు. ఆమె కూడా ఈ పెళ్లికి తప్పకుండా వస్తానని మాట కూడా ఇచ్చారట. జయలలిత ఏదైనా ఫంక్షన్‌కు వెళ్లాలంటే ఆమె సెక్యూరిటీ ముందుగా ఆ ఫంక్షన్‌కు వెళ్లి అంతా క్షుణంగా పరిశీలించిన తర్వాతే జయలలిత ఫంక్షన్‌కు వచ్చేవారు. కృష్ణ కూతురు పెళ్లికి కూడా ముందుగా సెక్యూరిటీ వాళ్ళు వచ్చి మండపంలో చాలామందిని కాళీ చేయించాలని కృష్ణ గారికి చెప్పారట.
ముందు మూడు వరుసలు ఖాళీ చేయాల్సిందే అని కండీషన్ పెట్టారట. అప్పటికే మంత్రులు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు కూర్చుని ఉన్నారు. వాళ్ళని లేపెయ్యలని సెక్యూరిటీ వాళ్ళు చెప్పగానే కృష్ణ గారు.. అలా లేపటం బాగోదని స్వయంగా జయలలితకే ఫోన్ చేసి పెళ్లికి రావద్దని చెప్పారట.
కృష్ణ గారు అన్న మాటను స్పోర్టివ్ గా తీసుకున్న జయలలిత వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఓ పెద్ద బొకేను పంపించారు. ఈ విధంగా ఆ రోజుల్లో పద్మావతి- గల్లా జయదేవ్‌ల వివాహం అందరికీ గుర్తుండిపోయింది. పెళ్లి శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆనాటి రోజుల్లో మళ్లీ గుర్తు చేసుకుంటున్నారు.