ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ గా మంచి క్రేజ్ సంపాదించుకుంది స్నేహ. గ్లామర్ షోలకు దూరంగా ఉంటూనే కోట్లాదిమంది ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. టాలీవుడ్ లో ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. సాంప్రదాయ వేషధారణ లో అందం, అభినయంతో మంచి క్రేజ్ సంపాదించుకున్న స్నేహ సినిమాల్లో హీరోయిన్గా ఎదగలేక పోవడానికి కారణం కొందరు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్సే నట.
అప్పటివరకు కూడా స్నేహ చేసిన అన్ని సినిమాల్లో ట్రెడిషన్ పాత్రలోనే కనిపించింది కానీ సినిమా అంటే కేవలం ట్రెడిషనల్ పాత్రలే కాకుండా కాస్త ఎక్స్పోజింగ్ పాత్రలో కూడా నటించాల్సి ఉంటుంది. స్నేహం మాత్రం అలాంటి సినిమాలకు నటించనని చెప్పేసేదట. కొంతమంది దర్శకులు స్నేహని హీరోయిన్గా తీసుకుంటే రొమాన్స్ రోల్స్ ప్లే చేయదనే ఉద్దేశంతో స్నేహని పక్కన పెట్టేసారని.. ఇదే కారణంగా స్నేహకు సినిమా అవకాశాలు తగ్గిపోయాయని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతోపాటు స్నేహ భర్త కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన పర్సన్ కావడంతో తను గ్లామర్ పాత్రలకి దూరంగా ఉండే పాత్రలో మాత్రమే నటించమని కండిషన్ పెట్టాడట.
ఈ రెండు కారణాలతోనే స్నేహ సినిమాల్లో హీరోయిన్గా ఎదగలేకపోయిందని.. ఎన్నో బ్లాక్ పాస్టర్ సినిమాల అవకాశాలను కోల్పోయిందంటూ సమాచారం. ఒకవేళ గ్లామరస్ రోల్ లో కూడా స్నేహ నటించి ఉంటే ఆమె కూడా సౌందర్య, రోజా, రమ్యకృష్ణ లాగా స్టార్ హీరోయిన్లలో ఒకరిగా ఉండేది. ఇక పెళైన తర్వాత సినిమాలకు దూరమైన స్నేహ మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ తో రామ్ చరణ్ హీరోగా నటించిన వినయ విధేయ రామ సినిమాలో కనిపించింది.